నల్గొండ

ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, మే 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరించిన మారడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాలు వారివని అన్నారు. మార్కెఫెడ్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే వచ్చే నష్టంలో కేంద్రం కూడా భరిస్తుందని దీనిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లపై గుంతల విషయంలో ప్రతినెల సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే పనులు జరుగుతాయని, కిందిస్థాయిలో అవినీతి రాజ్యమేలుతుందని, క్వాలిటీ కంట్రోల్‌బోర్డును, విజిలెన్స్ విభాగాలను సరిగా వినియోగించుకుంటే పనులు అవే జరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 1,925కోట్లతో రాయగిరి నుండి వరంగల్‌కు హైవే రోడ్డు నిర్మాణానికై నిధులను కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడంతో పనులు జరగడం లేదన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని తెలంగాణలో ఈనెల 23,24,25 తేదీల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటించనున్నారని అప్పుడే టీఆర్‌ఎస్ నేతల్లో భయం పట్టుకొని అమిత్‌షా వస్తే ఏమవుతుందని మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజకు బిజెపి విస్తరిస్తుందని మే 29 నుండి జూన్ 12వరకు తెలంగాణలోని అన్ని గ్రామాల్లో బిజెపి వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకై సిద్ధమవుతుందన్నారు. బిజెపి మతపరమైన రిజర్వేషన్‌లకు వ్యతిరేకమని పేద ముస్ల్లింలకు న్యాయం చేయాలని దేశాన్ని చీల్చేందుకై కొంత మంది ప్రయత్నిస్తున్నారని అన్నారు.
బిజెపి కార్యాలయం ప్రారంభం
మండల కేంద్రంలో మంగళవారం బిజెపి కార్యాలయాన్ని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు పివి శ్యాంసుందర్‌రావులు ప్రారంభించారు. కార్యక్రమంలో కాసం వెంకటేశ్వర్లు, మనోహర్‌రెడ్డి, దాసరి మల్లేశం, వేముల అశోక్, కర్నాటి ధనుంజయ్య, దంతూరి సత్తయ్య, రాచకొండ కృష్ణ, శీలోజు శ్రీరాములు, మైసోళ్ల మత్స్యగిరి, బచ్చు శ్రీనివాస్, దేవనక అంజయ్య, మాటూరి శివ, రావుల పద్మారెడ్డి పాల్గొన్నారు.

మద్దతు ధర కోసం ఎంపిని అడ్డుకున్న రైతులు
అర్వపల్లి, మే 2: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులతో కొనుగోలు చేయిస్తుందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్‌ను తిరుమలగిరి మండలకేంద్రంలో మంగళవారం రైతులు అడ్డుకున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం హైదరాబాద్ వెళ్తుండగా మార్కెట్ ముందు సూర్యాపేట-జనగాం రహదారిపై రైతులు ఎంపి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.1510ల మద్దతు ధర ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ ఏజెన్సీలు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయని రైతులు ఎంపికి మొరపెట్టుకోవడంతో పార్లమెంట్ సభ్యుడు మార్కెట్‌లోకి వెళ్లి మార్కెట్ అధికారులు, వ్యాపారస్థులతో మాట్లాడి అందరికి ప్రభుత్వం నిర్ణయించిన ధర వచ్చేలా కొనుగోలు చేయాలన్నారు. వ్యాపారస్థులు రైతులకు ఎంపి ముందు ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం ఎంపి వెళ్లిపోయారు.