నల్గొండ

మైనార్టీల ప్రగతి బిజెపితోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మే 15: మైనార్టీలను అన్ని రంగాల్లో అభివృద్ది చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా మైనార్టీల ప్రగతి బిజెపితోనే సాధ్యమని పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కె.బాబా అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా మైనార్టీ మోర్చా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పనితీరుకు ఆకర్షితులై దేశ వ్యాప్తంగా ముస్లింలు బిజెపిని ఆదరిస్తున్నారన్నారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి వారి సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి విద్యాపరంగా, ఆర్థికంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ బిజెపిని మతతత్వ పార్టీగా ముద్రవేసి దెబ్బతీసేందుకు ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుని వారికి అన్యాయం చేసిందన్నారు. మోదీ ఫ్రభుత్వం కులమాతాలకు అతీతంగా పనిచేస్తుండటంతో మైనార్టీలు మోదీకి మద్ధతుగా అన్ని ఎన్నికల్లోనూ నిలుస్తున్నారన్నారు. ఈ నెల 22నుండి జరిగే అమిత్‌షా పర్యటనలో మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లాఅధ్యక్షుడు సయ్యద్ పాషా, జిల్లా పార్టీ నాయకులు పోతెపాక సాంబయ్య, బషీరుద్ధిన్, షేక్ అమీర్, షరీఫ్, భాషా, సలీమ్, సయ్యద్‌లు పాల్గొన్నారు.
ఆటోలో ప్రసవంపై విచారణ
తిప్పర్తి, మే 15: తిప్పర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం వైద్యులు, సిబ్బంది ఎవరు అందుబాటులో లేక మహిళ ఆటోలో ప్రసవించిన ఘటనపై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, డిఎంహెచ్‌వో భానుప్రసాద్‌ల ఆదేశాల మేరకు సోమవారం పిహెచ్‌సిలో విచారణ జరిపారు. విచారణాధికారి డిసిసి సివో యాదగిరి పిహెచ్‌సిని సందర్శించి జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. స్ట్ఫానర్సు, వైద్యాధికారి అందుబాటులోలేని తీరుపై కలెక్టర్‌కు, డిఎంహెచ్‌వోకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు.