నల్గొండ

భగీరథ పైపులైన్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, మే 15: మండల కేంద్రమైన నేరేడుచర్ల, నర్సయ్యగూడెం గ్రామశివారు నుండి సోమవారం మిషన్ భగీరథ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పంట పొలాల నుండి పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టపోగా ప్రాణాలైనా అర్పిస్తాం.. పంట పొలాల నుండి పైపులైన్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని రైతులు అడ్డుకున్నారు. కొంతకాలంగా నేరేడుచర్లలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణం నేరేడుచర్ల రహదారి గుండా పంట పొలాల నుండి నిర్మించాలని అధికారులు ప్రయత్నించగా రహదారి వెంట దశాబ్దకాలంగా నివాసం ఉంటున్న వారు నిరాశ్రయులవుతారని అధికారులు పంట పొలాల నుండి నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు పలువురు రైతులు కోర్టుకు వెళ్లగా కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే గడువు ముగిసినందున అధికారులు సోమవారం పైపులైన్ నిర్మాణానికి ప్రయత్నం చేయబోగా రైతులు అడ్డుకున్నారు. మిషన్ భగీరథ ఎఇ మధు, నేరేడుచర్ల, పాలకీడు ఎస్‌ఐలు యాదవేంద్రారెడ్డి, గోపి, తహశీల్దార్ సత్యనారాయణలు నిర్మాణానికి మార్కింగ్ చేయబోగా రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భారీస్థాయిలో బందోబస్తును రప్పించి నర్సయ్యగూడెం వైపు నుండి తిరిగి మార్కింగ్ చేయబోగా రైతులు అడ్డుకోవడంతో పలువురిని అరెస్ట్ చేశారు. సిఐలు రజితరెడ్డి, నర్సింహారెడ్డి, ఎస్‌ఐ ఇస్తారాణి, ఆర్డీఓ మోహన్‌రావులు రైతులను సముదాయించబోయినప్పటికి వినకపోవడంతో రైతులు పొలంలో అడ్డుగా పడుకోని పైపులైన్ నిర్మాణానికి సహకరించమని నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకవైపు అధికారులు పంటపొలాల నుండి పైపులైన్ నిర్మాణం చేపడ్తామని, మరో వైపు ఎట్టి పరిస్థితిలో నిర్మాణానికి సహకరించమని రైతులు పట్టుబడుతుండడంతో సాయంత్రం వరకూ ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఎంత రాత్రి అయినా పైపులైన్ నిర్మాణం చేపడ్తామని అధికారులు నిర్ణయించారు. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఎట్టకేలకు ఎకెబిఆర్ హైలెవల్ కెనాల్‌కు నీటి విడుదల
పెద్దఅడిశర్లపల్లి, మే 15: అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి హైలెవల్ కెనాల్(డిస్టిబ్యూటరీ 7బి)కు సోమవారం దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నీటి విడుదల చేశారు. గత కొనే్నళ్లు ఈ ప్రాంత రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతాంగంలో నీటి విడుదల చేయడంతో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైలెవల్ కెనాల్ ద్వారా పిఏపల్లి మండలంతో పాటు గుర్రంపోడు మండలం వరకు నీరు అందనుంది. ప్రస్తుతం గుడిపల్లి పంచాయతీలోగల పలుగు చెరువు, గార్లకుంటలతో నీటి విడుదల చేయనున్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ శీలం శేఖర్‌రెడ్డి, ఎంపిటిసి చంద్రారెడ్డి పాల్గొన్నారు.
భగ్గుమన్న సూరీడు
44.6 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
నల్లగొండ టౌన్, మే 15: వేసవి ఎండల తీవ్రత ఈ సీజన్‌లో సోమవారం మరింత పెరిగింది. ఏకంగా 44.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 28.0డిగ్రీల కనిష్ట ఉష్ణోత్రలు నమోదైన తీరు పెరిగిన ఉష్ణోగ్రతలకు నిదర్శనంగా నిలిచింది. ఎండల వేడిమి, వడగాలుల ధాటికి కూలీలు, రైతులు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ప్రయాణికులు, వృద్ధులు, చిన్నారులు తల్లిడిల్లిపోయారు.