నల్గొండ

చిరకాల స్వప్నం సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 15: తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా బత్తాయి సాగు చేస్తున్న జిల్లాగా గుర్తింపునొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లా బత్తాయి రైతాంగం దశాబ్ధాల ఎదురుచూపు చిరకాల స్వప్నమైన బత్తాయి మార్కెట్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరుగనుంది. నల్లగొండ శివారులోని గంధవారిగూడెం ఎస్‌ఎల్‌బిసి క్యాంపు భూముల్లోని 12 ఎకరాల్లో కోటిన్నర వ్యయంతో బత్తాయి మార్కెట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో నిర్మాణ పనులకు నేడు మార్కెటింగ్, ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిలు శంకుస్థాపన చేయనున్నారు. బత్తాయి మార్కెట్‌లో రెండు భారీ షెడ్లు, కార్యాలయం, రైతుల విశ్రాంతిగది, మంచినీరు ఇతర వసతులు తొలి దశలో ఏర్పాటు చేస్తారు. తదుపరి కోల్ట్ స్టోరేజీ నిర్మించాలన్న యోచన ఉన్నా దీనిపై స్పష్టత లేదు. మద్దతు ధర సాధనలో కోల్డ్ స్టోరేజీ, జ్యూస్ ఫ్యాక్టరీ పెడితే బత్తాయి రైతులకు ప్రోత్సహంగా ఉంటుందన్న వాదన రైతు సంఘాల నుండి వినిపిస్తోంది.
మార్కెట్‌తో తీరనున్న బత్తాయి రైతుల చింతలు !
ఇంతకాలం బత్తాయి మార్కెట్ లేక జిల్లా బత్తాయి రైతులు దళారీల దోపిడీకి గురవుతు చితికిపోగా సగానికి పైగా బత్తాయి సాగు పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో 75వేల హెక్టార్లలో బత్తాయి సాగులో ఉండగా 50వేల మంది రైతులు బత్తాయి తోటలపై ఆధాపడ్డారు. ఏటా 1300 కోట్లకు పైగా బత్తాయి వ్యాపారం సాగుతుండగా ఇతర రాష్ట్రాలకు జిల్లా బత్తాయి దిగుబడులు ఎగుమతి అవుతున్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల హయాంలో బత్తాయి మార్కెట్ సాధన కోసం ఈ ప్రాంతా రైతాంగం చేసిన అనేక పోరాటాలు, ప్రజాప్రతినిధులు విన్నపాలు, ఒత్తిళ్లు ఫలించలేదు. దీంతో బత్తాయి రైతులు లక్షల రూపాయలు వెచ్చించి బోర్ల నీటితో సాగు చేసిన బత్తాయి దిగుబడులను దళారీలకు విక్రయించి, గడ్డి అన్నారం, కొత్తపేట మార్కెట్‌లకు వ్యయ ప్రయాసల మధ్య తరలించి అక్కడి వ్యాపారులు నిర్ణయించిన అరకొర ధరలకే అమ్మకాలు చేసి తీవ్రంగా నష్టపోవడం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో బత్తాయి రైతుల కష్టనష్టాలను సుదీర్ఘకాలంగా గమనిస్తున్న జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిలు సిఎం కెసిఆర్‌కు, మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావులకు సమస్య తీవ్రతను వివరించారు. అదిగాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సైతం బత్తాయి మార్కెట్‌ను ఏర్పాటు చేయాల్సివుందని విన్నవించారు. అటు విపక్షాల నుండి సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం అసెంబ్లీలో నల్లగొండలో బత్తాయి మార్కెట్ ఏర్పాటు కోసం గళమెత్తారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావులు నల్లగొండలో బత్తాయి మార్కెట్‌ను మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేయగా నేడు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా బత్తాయి మార్కెట్ శంకుస్థాపన స్థలాన్ని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ అసెంబ్లీ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి దుబ్బాక నరసింహారెడ్డి, పాశంరాంరెడ్డిలు సోమవారం సాయంత్రం పరిశీలించారు. శంకుస్థాపన, సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వరాష్ట్రంలో నెరవేరనున్న జిల్లా బత్తాయి రైతుల కోరిక బత్తాయి మార్కెట్ శంకుస్థాపనకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.