నల్గొండ

అభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్‌కు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 15: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేవలం మూడేళ్లల్లో చేపట్టిన అభివృద్ధిని చూసే ప్రజలు, వివిధ పార్టీల నేతలు ఆదరిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూర్(ఎస్) కందగట్ల గ్రామానికి చెందిన సుమారు వంద మంది బిజెపి నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరగా మంత్రి వారికి గులాబి కండువాలుకప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అందరి కష్టాలు ఎరిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలల్లో ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో అందరి భాగస్వామ్యంతో పూర్తిస్థాయిలో అభివృద్ది సాధించి అందరికి ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కసగాని లక్ష్మిబ్రహ్మం, సర్పంచ్ ముద్దం విజయ, లక్ష్మి, కృష్ణారెడ్డి, బెల్లంకొండ యాదగిరి, బత్తుల ప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి చేరిన వారిలో విద్యా కమిటీ చైర్మన్ నూనావత్ శంకర్‌నాయక్, లింగానయక్, వన్యానాయక్, దేవుజా, పవన్, రమేష్, మోహన్, ఉపేందర్, గణేష్, కోటమ్మ, కవిత, శారధ తదితరులు పాల్గొన్నారు.
238 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం
* విత్తన కంపెనీ ఫిర్యాదుతో అధికారుల దాడులు
దేవరకొండ, జూన్ 15: దేవరకొండ ప్రాంతంలో అధికంగా ఉన్న గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పత్తి వ్యాపారులు తమ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం దేవరకొండ పట్టణంలో ఓ దుకాణం నుండి వ్యవసాయ అధికారులు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొని కేసును నమోదు చేసిన ఘటన మరవక ముందే గురువారం రోజు దేవరకొండ పట్టణంలో వ్యవసాయ అధికారులు ఓ దుకాణం పై దాడి చేసి 238 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వ్యవసాయ అధికారి మునికృష్ణయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సత్యసాయి కాలేజీ సమీపంలో ఉన్న పద్మావతి ట్రేడర్స్ దుకాణంలో కోహినూర్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ప్యాక్ చేయబడ్డ 238 పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏవో మునికృష్ణయ్య తెలిపారు. కోహినూర్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో నకిలీ పత్తి విత్తనాలను ప్యాక్ చేసి అమ్ముతున్నారని కంపెనీ ఎండి సురేశ్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పద్మావతి ట్రేడర్స్ దుకాణంపై దాడి చేసి 238 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏవో మునికృష్ణయ్య చెప్పారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న దుకాణ యజమాని రమావత్ దస్రూపై పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్లు ఏవో చెప్పారు.