నల్గొండ

విద్యతోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 15: విద్యతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తాళ్లఖమ్మంపహాడ్ గ్రామంలో గురువారం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ విద్యారంగ ప్రాధాన్యతను గుర్తించి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరుస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సిఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు కృషిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గురుకుల పాఠశాలల్లో 1లక్షల 20వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో లక్ష సీట్లు ఉంటే 4లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. ఎందరో గొప్ప వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత శిఖిరాలను అధిరోహించారని వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు పట్టుదలతో చదివి ప్రయోజకులు కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేదని పేదలు సైతం కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నారని అందువల్ల ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కేజి టూ పిజి ఉచిత విద్య విధానంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్యార్థులకు మంచి విద్య అందుతున్న భావనను తొలగించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలను గొప్పగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. సూర్యాపేట జిల్లా ఏర్పాటు తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ది కోసం రూ.25కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాధికారి బి. వెంకటనర్సమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రైతు సమగ్ర సర్వే అసంపూర్ణం..!
గడువు పొడగించినా దక్కని ఫలితం !!

నల్లగొండ, జూన్ 15: రైతు సమగ్ర సర్వే నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అసంపూర్తిగా ముగిసింది. ఈనెల 10వ తేది నాటికి పూర్తి సర్వే పూర్తి చేయాల్సివున్నా అప్పటికి 60శాతమే పూర్తి కావడంతో ప్రభుత్వం 15వ తేదీకి గడువు పెంచింది. పెంచిన గడువు కూడా గురువారం నాటితో ముగిసిపోగా జిల్లాల్లో రైతు సమగ్ర సర్వే అసంపూర్తిగానే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ నుండి రైతులకు ఎరువుల పెట్టుబడి సహాయంగా ఎకరాకు ఏటా ఎనిమిదివేల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు ఎంత మంది రైతులు ఉన్నారన్నదానితో పాటు ఏ భూముల్లో ఎంత మేరకు పంటల సాగు చేస్తున్నారు.. ఏయే పంటలు వేస్తున్నారన్న వివరాలను సేకరించేందుకు రైతు సమగ్ర సర్వేకు ఆదేశించారు. మునుముందు ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ పథకాలను ఈ సర్వే వివరాల ఆధారంగా అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే దాదాపు నెల రోజుల పాటుగా సర్వే చేపట్టినప్పటికి నేటికి నల్లగొండ జిల్లాలో 81.30శాతం మాత్రమే సర్వే పూర్తి చేశారు. 4లక్షల 25, 530మంది రైతులకుగాను 3లక్షల 45, 964మంది రైతుల వివరాలను సేకరించగలిగారు. మిగతా రైతుల వివరాల సేకరణ అసంపూర్తిగానే మిగిలింది. వారి వివరాలను ఈ నెల 19,20వ తేదిల్లో జరిగే గ్రామసభల సందర్భంగా సేకరించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
రికార్డుల నిర్వాహణ లోపం.. సర్వేకు ఆటంకం
రైతు సమగ్ర సర్వేకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలను రంగంలోకి దించి సాక్షరాభారత్ కోఆర్డినేటర్ల సహాయం కూడా తీసుకున్నప్పటికి గడువులోగా సర్వే వివరాల సేకరణ పూర్తి చేయకపోవడం గమనార్హం. రెవెన్యూ రికార్డుల నిర్వాహణ లోపం జిల్లాలో రైతు సమగ్ర సర్వేకు ఆటంకంగా పరిణమించిందన్న వాదన వినిపిస్తోంది. పెద్ద రైతులు, వ్యాపార భూములున్న రైతులతో పాటు వలసలు వెళ్లిన రైతులు తమ వివరాలను సర్వే యంత్రాంగానికి అందించడంలో ఆసక్తి చూపలేదు. దీనికంటే ముఖ్యంగా రైతుల సంఖ్య, భూముల వివరాలతో పోల్చితే కొందరు పేర్లు 1(బి)్ఫరంలో రైతుల వివరాలు ప్రస్తుత హక్కుదారులతో పాటు పాత హక్కుదారుల పేర్లు కూడా కొనసాగుతుండటంతో తీవ్రమైన వ్యత్యాసాలకు కారణమైంది. దీంతో సమగ్ర సర్వే సైతం నిర్ధిష్టంగా రైతుల భూ రికార్డులు, కమతాల రికార్డులు, పంటల వివరాలను సేకరించలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం సమగ్ర సర్వేను సమీక్షించి అసంపూర్తి సర్వే పూర్తికి, అలాగే వివరాల సేకరణలో పారదర్శకత, స్పష్టతకు ఎలాంటి చర్యలు తీసుకోనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

నెలాఖరుకల్లా మిషన్ భగీరథ పూర్తి
* కలెక్టర్ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశం

నల్లగొండ, జూన్ 15: మిషన్ భగీరథ పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఇంజినీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మిషన్ భగీరథ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పైప్ లైన్ పనులు, ఇంట్రావిలేజ్ పనులు, ఇంటెక్‌వెల్, అవుట్‌టెక్ వెల్, పంప్ హౌస్, మోటార్స్ ఏర్పాటు పనులను రోజువారి నిర్ధేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు చేపట్టడంలో ఏ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించినా సంబంధిత డిఈలు తన దృష్టికి తీసుకరావాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం, నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున వ్యవసాయ భూముల్లో పైప్ లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూ సమస్యలు, ఇసుక, ఇతర సమస్యలపై తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. ప్యాకేజీల వారీగా పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యుయస్ ఈఈ పాపారావు, కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.