నల్గొండ

అందరికి స్వాతంత్య్ర ఫలాలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 15: మహానీయుల పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్య్ర ఫలాలు అందరికి అందించడమే ప్రభుత్వాల కర్తవ్యమని ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారుల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం నల్లగొండ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రసంగించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రజల జీవన ప్రమాణాల పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి ఐదుకోట్ల ఉచిత చేప పిల్లలను సరఫరా చేస్తుందన్నారు. గొర్రెల పెంపకందారులకు 30వేల గొర్రెల యూనిట్లను పంపిణీ చేపట్టామన్నారు. చేనేత కార్మికులకు త్రిఫ్ట్ పథకం, సబ్సిడీ నూలు పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు కొత్తగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి ఫీజురీయంబర్స్‌మెంట్, అంబేద్కర్ ఓవర్సిస్ పథకాల ద్వారా వారికి ఉన్నత చదువులకు ఆర్థిక చేయూతనందిస్తుందన్నారు. దళితులకు భూపంపిణీతో పాటు 122కోట్ల సబ్సిడీ ఉపాధి రుణాలు ఈ ఏడాది ప్రభుత్వం అందిస్తుందన్నారు. మహిళాశిశు సంక్షేమానికి అమ్మఒడి కెసిఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి పథకాలు అమలు చేస్తునే ప్రభుత్వ వైద్యశాలల ఆధునీకరణకు నిధులు అందిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు ఈ ఏడాది 22కోట్లు పంపిణీ చేశామన్నారు. ఆసరా పింఛన్లను నెలకు 22కోట్లు పంపిణీ సాగుతుందన్నారు. వ్యవసాయ రంగం సంక్షేమానికి 2లక్షల 62వేల మంది రైతులకు 1330కోట్ల రుణమాఫీ అమలు చేశామన్నారు. 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా జిల్లాలో కొనసాగుతుందన్నారు. ఉద్యాన, పట్టుపరిశ్రమలకు కోట్లాది రూపాయల రాయితీ పథకాలు, పాడిపోషణకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. నకిరేకల్‌లో నిమ్మ, నల్లగొండలో బత్తాయి, పిఏపల్లిలో దొండ మార్కెట్‌ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయన్నారు.
సాగు, తాగునీటి విస్తరణ పథకాలకు ప్రాధాన్యత
జిల్లాలో మిషన్ కాకతీయ కింద మూడు దశల్లో 453కోట్లతో 1205చెరువుల పునరుద్ధరణ చేపట్టి 138కోట్లు ఖర్చు చేసి 695చెరువుల పనులు పూర్తి చేశామన్నారు. సాగర్ ఆధునీకరణలో భాగంగా కాలువల ఆధునీకరణకు 270కోట్లు ఖర్చు చేశామన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో జలాశయాల నిర్మాణాలకు 4367కోట్లతో టెండర్లు పిలిచి కొన్నింటి పనులు సాగుతున్నాయన్నారు. ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు ఎగువ, దిగువ కాలువలు, ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మిషన్ భగీరథతో జిల్లాలో 3వేల కోట్లతో చేపట్టిన పనులు అధిక శాతం పూర్తికాగా ఓహెచ్‌ఎస్‌ఆర్, అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణాలకు 472కోట్లు మంజూరు జరిగాయన్నారు. డబుల్ బెడ్‌రూమ్ పథకాలతో రెండు విడతల్లో 8065ఇళ్లు మంజూరు చేయగా మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో టిఎస్ ఐపాస్ ద్వారా 226కోట్లతో 90పరిశ్రమల్లో 4,600మందికి ఉపాధి కల్పించబడిందన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ నిర్మాణాలకు అన్ని అనుమతులు సాధించామని, జిల్లాలో 692కోట్లతో ఆర్‌అండ్‌బి రోడ్లు, 443కోట్లతో పంచాయతీజరాజ్ రోడ్ల విస్తరణ పురోగతిలో ఉన్నాయన్నారు. స్వచ్ఛ్భారత్ కింద 13,713మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. హారిత హారం అమలుకు 2కోట్ల మొక్కలు నాటించాలన్న లక్ష్యంలో 70లక్షల మొక్కలు నాటామన్నారు. ఆహార భద్రత కార్డుల ద్వారా 4లక్షల 50వేల కుటుంబాలకు నెలకు 8,659మెట్రిక్ టన్నుల బియ్యం, హాస్టల్స్‌కు, పాఠశాలలకు 6,715టన్నుల సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. మహిళలకు 27,725దీపం కనెక్షన్ల పంపిణీ, గుడుంబా మానివేసిన కుటుంబాలు 4.58కోట్లతో ఉపాధి కల్పన చర్యలు చేపట్టామన్నారు. పోలీస్ శాఖ ఒకవైపు శాంతిభద్రతల పరిరక్షణ విధులు చేస్తునే మరోవైపు జనమైత్రి, అమ్మానన్ను అమ్మకే, ఆడబిడ్డ ముద్దు బిడ్డ, ఉచిత వైద్యశిబిరాలు, ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాలతో సామాజిక సేవా బాధ్యతలు కొనసాగించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్.్భస్కర్‌రావు, వేముల వీరేశం, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జెసి సి.నారాయణెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.