నల్గొండ

ఆర్డీఆర్‌కు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట: స్వాతంత్య్ర దినోత్సవం రోజున వేడుకలకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్‌కు నిరసనగా ఆర్డీఆర్ చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఆమె దామోదర్‌రెడ్డి అరెస్ట్ సందర్భంగా ఆయన సొమ్మసిల్లి పోవడంతో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు స్వాతంత్య్ర వేడుకలు జరపకుండా అరెస్ట్‌లు చేయించడం నియంతృత్వ వైఖరికి నిదర్శమన్నారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఆందోళన చేపట్టిన దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పక్షాన అండగా నిలుస్తామన్నారు. అక్రమ అరెస్ట్‌లను మానుకోకుంటే సహించేద లేదని హెచ్చరించారు.