నల్గొండ

స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణకు బాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట: స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, సిఎం మూడేళ్ల పాలనలో ప్రజలకు పరిపాలనను చేరువచేసే లక్ష్యంతో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని నూతన జిల్లాగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా అభివృద్ధిలో పురోగమిస్తూ ముందంజలో ఉందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. 71వ స్వాంతత్య్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ కవాతు మైదానంలో మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం స్వాతంత్య్రం తర్వాత భారతదేశంలో విలీనమైందని, ఆ తర్వాత సమైక్య వాధులు కుట్రలు చేసి భాష ప్రయుక్తం పేరుతో ఆంధ్రాలో కలిపారని అన్నారు. సమైఖ్య పాలనలో దోపిడి, వివక్షత చూపడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పురుడుపోసుకుందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో శాంతియుత మార్గంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటుచేశామన్నారు. ఉద్యమ నేతగా ఏఆశయం కోసం పోరాడారో రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కెసిఆర్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నేరవేర్చుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని ప్రచారం చేశారని వాటిని తిప్పి కొడుతూ తెలంగాణలో వెలుగులు నింపి గృహ, పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ప్రయోగాత్మకంగా ఉమ్మడి జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో వ్యవసాయానికి 9గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని వచ్చే ఏడాది నుంచి రాష్టవ్య్రాప్తంగా రైతులకు 24గంటల విద్యుత్‌ను ఆందించి ప్రపంచంలోనే ఏ దేశంలో సాధించని ప్రగతిని చాటుతామన్నారు. ఆవిర్భావించిన మూడేళ్లలో దేశంలోనే నెంబర్-1రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనీకత, దక్షతకు నిదర్శనమన్నారు. కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా గత చరిత్రకు ధీటుగా కొత్త జిల్లాగా పురోభివృద్ది సాధిస్తుందన్నారు. అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ది పరిచి తెలంగాణలోనే నెంబర్-1 జిల్లాగా నిలుపే కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోనే సమకూరే సంపద తెలంగాణ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు. వచ్చే డిసెంబర్ నాటికి ఇంటింటికి మంచినీటిని అందించే మిషన్ భగీరథ పథకాన్ని పూర్తిచేసి జిల్లా ప్రజల తాగునీటి కష్టాలను కడతేర్చుతామన్నారు. మరో నెలరోజుల్లో పాలేరు పథకాన్ని పూర్తిచేసి సూర్యాపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంచను నెరవేర్చబోతున్నట్లు హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. ఈ పథకం కింద రూ.1774కోట్లతో ప్రధాన పైపులైన్ పనులు, రూ. 262కోట్లతో అంతర్గత పైపులైన్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. మిషన్ కాకతీయ పథకం కింద రూ. 440కోట్లతో 747చెర్వులను పునరుద్ధరించినట్లు తెలిపారు. 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో సాగర్ ప్రాజెక్టు పరిధిలో రూ. 330కోట్లతో పనులు చేపట్టి అందులో రూ.254కోట్ల పనులను పూర్తిచేసినట్లు తెలిపారు. శ్రీరాంసాగర్ రెండవ దశ ఆధునీకరణకు రూ. 252కోట్లు, మూసీ ఆధునీకరణకు రూ. 70కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మేడిగడ్డ ద్వారా శ్రీరాంసాగర్ రెండవ దశకు సాగునీటిని అందించి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీటిని అందిస్తామన్నారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను అందించడం జరుగుతుందని వచ్చే ఏడాది నుండి రైతులకు ఎకరాకు రూ. 4వేల చొప్పున పెట్టుబడుల కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పేదల ఇండ్లలోని ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రూ. 3,329కోట్లతో 14 పరిశ్రమలను నెలకొల్పి 5వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా ఎస్సి, ఎస్టి వర్గాలకు చెందిన 375 మంది పారిశ్రామిక వేత్తలకు రూ. 10కోట్లను ప్రోత్సహకంగా అందించామన్నారు. జిల్లాలో 5,609 రెండు పడక గదుల ఇండ్లను మంజూరు చేసి పేదల సొంతంటి కళను నేరవేర్చుతున్నామన్నారు. మహిళా సంఘాలకు వివిధ పథకాల కింద రూ. 235కోట్ల ఆర్ధిక సహాయం అందించినట్లు తెలిపారు. జిల్లాలో రూ. 2,079కోట్లతో రహదారుల విస్తరణ చేపడుతున్నామన్నారు. గ్రామీణ వృత్తిదారులకు చేయూతనిచ్చే లక్ష్యంతో జిల్లాలో 75శాతం రాయితీలపై 35వేల మంది యాదవులకు గొర్రెల యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఆర్ధిక, కెసిఆర్ కిట్లను పంపిణిచేసే పథకాన్ని ప్రారంభించి జిల్లాలో 3వేల మంది మహిళలకు లబ్ధిచేకూర్చామన్నారు. ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో జిల్లాలో ప్రయోగాత్మకంగా జనహిత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో యావత్తు ప్రజానీకం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా సమగ్రాభివృద్దిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్, ఎస్పి పరిమళ హనానూతన్, తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్‌కుమార్, మున్సిపల్ చైర్‌ఫర్సన్ గండూరి ప్రవళిక, జెసి సంజీవరెడ్డి, డిఆర్వో పబ్బతిరెడ్డి యాదిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై. వెంకటేశ్వర్లు, మంత్రి సతీమణి సునీతా తదితరులు పాల్గొన్నారు.