నల్గొండ

కెసిఆర్ అసమర్థ పాలనకు బతుకమ్మ చీరలే నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 19: సిఎం కెసిఆర్ ప్రభుత్వం అసమర్థ పాలనకు నాసిరకం బతుకమ్మ చీరలే నిదర్శనమని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు 220కోట్ల ప్రజాధనం వెచ్చించి నాసిరకం చీరలు పంపిణీ చేసి తెలంగాణ ఆడపడుచులను కెసిఆర్ ప్రభుత్వం అవమానించిందన్నారు. అసలు చీరల కొనుగోలు తతంగంపై విచారణ జరిపి నిజానిజాలు ప్రజలు తెలపాలన్నారు. తెలంగాణ చేనేత కార్మికులకు ఆదుకుంటామని పని కల్పిస్తామని చెప్పి చేనేత కార్మికులందరికి పని ఇవ్వకపోగా సూరత్ కంపెనీల నాసిరకం చీరలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఆంతర్యమేమిటంటు నిలదీశారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామంటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చెప్పిన సిఎం కెసిఆర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాకా దీనికి దూరంగా ఉండటం పచ్చి అవకాశవాద రాజకీయమన్నారు. తెలంగాణ సాధన కోసం ఆత్మహత్య యత్నం చేసిన అయుబ్‌ఖాన్‌ను కెసిఆర్ పరామార్శించకపోవడం విచారకరమన్నారు. మంత్రివర్గంలో తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులను చేర్చుకుని తన పాలనా వైఫల్యాలకు గత ప్రభుత్వాలు నిందించడం కెసిఆర్‌కే చెల్లిందన్నారు. గత ప్రభుత్వాల్లో కూడా ఇప్పుడున్న ఫిరాయింపు మంత్రులే పాలన సాగించిన సంగతి కెసిఆర్ మరువడం విడ్డూరమన్నారు. కెసిఆర్ నిరంకుశ, గారడీ పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ ఇంటిపార్టీ చైతన్యవంతం చేస్తుందని సామాజిక తెలంగాణ సాధనకు, బలహీన వర్గాలకు రాజ్యాధికార సాధనకు కృషి చేస్తుందన్నారు. ఆర్యవైశ్యులపై కంచె ఐలయ్య చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆ విమర్శలను ఐలయ్య వెనక్కి తీసుకుని వివాదానికి తెరదించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటిపార్టీలో చేరిన పలువురికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర నాయకురాలు చెరుకు లక్ష్మి, అంజయ్య, నవీన్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
*మండపాలకు చేరిన కనకదుర్గ అమ్మవారి విగ్రహాలు
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 19: విజయదశమి సందర్భంగా నేటి నుండి దేశి శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వాహణకు జోరుగా ఏర్పాట్లు చేపట్టారు. కాలనీలు, వివిధ వాణిజ్య సంస్థల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వాహణకు పెద్ద సంఖ్యలో అందంగా మండపాలను ముస్తాబు చేశారు. వివిధ ఆకర్షణీయ ఆకృతుల్లో దుర్గా అమ్మవారి విగ్రహాలను మండపాలకు చేర్చి నేటి నుండి శరన్నవరాత్రి పూజలు ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని శివాజీనగర్, సావర్కర్‌నగర్, పాతబస్తీ, పద్మావతికాలని, పద్మానగర్, అలకాపురి, అలివేలుమంగాపూరి, దేవరకొండ రోడ్, హైద్రాబాద్ రోడ్ కాలనీల్లో పెద్ద ఎత్తున దేవి శరన్నవరాత్రి పూజలకు ఏర్పాట్లు చేశారు.

మద్యం దుకాణాల లైసెన్స్‌లకు దరఖాస్తుల వెల్లువ
*మూడు జిల్లాల్లో 276 దుకాణాలకు 7వేల దరఖాస్తులు

నల్లగొండ, సెప్టెంబర్ 19: మద్యం దుకాణాల లైసెన్స్‌లకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చివరి రోజు మంగళవారం దరఖాస్తుల వెల్లువ సాగింది. రెండేళ్ల కాలపరిమితి నేపధ్యంలో కొత్త దుకాణాల కాలపరిమితిలోనే సహకార, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగనుండటంతో ఈ దఫా మద్యం దుకాణాల లైసెన్స్‌లకు డిమాండ్ పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 276దుకాణాలకు గాను ఏకంగా 7వేల వరకు దరఖాస్తులు అందినట్లుగా సమాచారం. మంగళవారం రాత్రి 10గంటల వరకు కూడా నల్లగొండలో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండటంతో దరఖాస్తుల సంఖ్య సమాచారంపై జాప్యం నెలకొంది. నల్లగొండ జిల్లాలో 18 దుకాణాలకు 3వేల వరకు దరఖాస్తులు, సూర్యాపేట జిల్లాలో 71 దుకాణాలకు 2800 దరఖాస్తులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 67 దుకాణాలకు 1130 దరఖాస్తులు అందినట్లుగా తెలుస్తోంది.