నల్గొండ

పథకాలపై విపక్షాలది రాజకీయ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 19; సిఎం కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల అమలుకు ప్రజల నుండి లభిస్తున్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్షాలు రాజకీయ రాద్దాంతం చేస్తున్నాయంటు నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు పిసిసి చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భూరికార్డుల నవీకరణ ఎందుకంటు, రైతు సమితిలు పంచాయతీల అధికారాలు హరించివేస్తాయంటు చేసిన విమర్శలు ఆయన అవగాహన రాహిత్యాన్ని చాటుతున్నాయన్నారు. వ్యవసాయంపై అవగాహన లేని, రైతుకాని ఉత్తమ్ వంటి నాయకులు రైతు పక్షపాతిగా సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న రైతాంగ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్థం చేసుకోలేక లేనిపోని విమర్శలు చేస్తు రాజకీయ దురుద్ధేశాన్ని చాటుకుంటున్నారన్నారు. బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాల గగ్గోలు టిఆర్‌ఎస్ పథకాల పట్ల ఓర్వలేని బుద్ధిని బయటపెట్టిందన్నారు. చీరలు తీసుకున్న మహిళలు సంతోషంగా ఇంటికెలుతుంటే వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టి చీరలను దగ్ధం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. తాను తిప్పర్తిలో చీరల పంపిణీ చేసిన సభలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొని సిఎం కెసిఆర్ బతుకమ్మ చీరలందించడం బాగుందంటు ప్రశంసించి, బయటకెళ్లి కార్యకర్తలతో కలిసి చీరల తగులబెట్టి నిరసన తెలిపిన తీరు కాంగ్రెస్ నాయకుల దంద్వ బుద్ధిని చాటుతుందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ తొలి ఏడాది సరిపడ చీరలను చేనేత కార్మికులు అందించలేకపోయారని, కోటి 4లక్షల చీరలకుగాను 50లక్షలకు పైగా చీరల కొరత ఏర్పడటంతో సూరత్ చీరలను కొనుగోలు చేసి మహిళలకు అందించారని ఇదే విషయాన్ని ప్రభుత్వం ముందే అందరికి తెలియచేసిందన్నారు. వచ్చే ఏడాది పూర్తిగా చేనేత చీరలనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాల రైతుల సంక్షేమానికి సిఎం కెసిఆర్ ప్రభుత్వం అన్ని డెయిరీలకు నాలుగురూపాయల ప్రోత్సాహకం ప్రకటించడం పట్ల మదర్ డెయిరీ రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుందన్నారు. మదర్ డెయిరీ, విజయా డెయిరీ స్టేట్ ఫెడరేషన్ ముల్కనూరు రైతులు 2లక్షల మందికి 50శాతం, ఎస్సీ, ఎస్టీలకు 75శాతం రాయితీపై పాడిగేదెలు అందిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించడం క్షీర విప్లవ లక్ష్యాల్లో గొప్ప ముందడుగు వంటిదన్నారు. రైతు పక్షపాతిగా సిఎం కెసిఆర్ రైతు సంక్షేమ పథకాలను అమలుచేస్తు హరిత, క్షీర, నీలి విప్లవాల లక్ష్యాల సాధనలో రాష్ట్రాన్ని ముందడుగు వేయిస్తున్నారన్నారు. ఆర్యవైశ్యులపై కంచె ఐలయ్య చేసిన విమర్శలు తీవ్రంగా ఖండిస్తున్నామని గుత్తా స్పష్టం చేశారు. భావ స్వేచ్ఛపేరుతో ఇతరులను కించపరిచే హక్కు రాజ్యంగం ఎవరికి ఇవ్వలేదన్నారు. ఐలయ్యకు లేనిపోని ప్రచారం కల్పించి వివాదాన్ని మరింత తీవ్రం చేయకుండా మీడియా ఆయనను దూరం పెట్టాలన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నియోజకవర్గం ఇన్‌చార్జి దుబ్బాక నరసింహారెడ్డి, నాయకులు బొర్ర సుధాకర్, ఎంపిపి దైద రజిత తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరలతో ప్రజాధనం దుబారా
*టిఆర్‌ఎస్ సర్కార్‌పై నూకల ధ్వజం

నల్లగొండ, సెప్టెంబర్ 19: బతుకమ్మ చీరల పంపిణీ పేరుతో మహిళలకు నాసిరకం చీరలను పంపిణీ చేసి వారిని అవమానించడంతో పాటు ప్రజాధనాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం దుబారా చేసిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు చేనేత చీరలను పంపిణీ చేస్తామని చెప్పి సూరత్ మిల్లుల నుండి కిలోల లెక్కన నాసిరకం చీరలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేసిందన్నారు. అలాగే చేనేతను ఆదుకునేందుకు, ఆడబిడ్డలకు ఆత్మగౌరవం, పండుగ కానుక అంటు బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చామని చెప్పిన కెసిఆర్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహారించిందన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు ఆలస్యంగా చీరల తయారీకి ఆర్డర్ ఇవ్వడం, ఇతర ప్రాంతాల్లో చేనేత కార్మికులకు చీరల పని అప్పగించకపోవడంతో కోటి 4లక్షల చీరలకు 50లక్షలకు పైగా చీరలు తక్కువ పడ్డాయన్నారు. దీంతో సూరత్ చీరలను కొనాల్సిరావడంతో తెలంగాణ చేనేత కార్మికులు, ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా 220కోట్ల ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చుచేసిన వైనంపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలన్నారు. మహిళలు కూడా బతుకమ్మ పండుగ చీరలు తగులబెట్టకుండా హిందూ సాంప్రదాయాలను గౌరవించాలని, ఇతర రూపాల్లో నిరసన తెలపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టి అభాసుపాలై తన స్వీయ తప్పిదాలతో ప్రజల నుండి ఎదురవుతున్న నిరసనను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలపై దాడి చేయడం సహేతుకంగా లేదన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా నాయకులు పొతేపాక సాంబయ్య, కర్నాటి వెంకన్న, రాపోలు విద్యాసాగర్, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.