నల్గొండ

ఓర్వలేని రాజకీయాలు మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూర్, సెప్టెంబర్ 21: ప్రతిపక్షాలు ఓర్వలేని రాజకీయాలు మానుకోవాలని టిఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు మహిళలకు కనీసం జాకెట్ ముక్క కూడా ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తే రాద్దాంతం చేస్తూ ఆందోళనలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. మోత్కూర్, అడ్డగూడూరు మండలాల్లో 19,848 చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగా బతుకమ్మను ఎంపి కవిత తీర్చిదిద్దారన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు సాయంత్రం 4 గంటలకు నిర్వహించే బతుకమ్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, ఆయన సతీమణి కమల హాజరవుతారని తెలిపారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ సిహెచ్.మహేంద్రనాథ్, సర్పంచ్ పిచ్చయ్య, ఉప సర్పంచ్ నర్సింహా, నాయకులు మేఘారెడ్డి, యాకుబ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీను, వెంకటేశ్వర్లు, శైలజ, ఆనందమ్మ, కమల, ఇంద్రజ్యోతి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి
*ఎస్పీ శ్రీనివాస్‌రావు
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 21: జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం హోంగార్డ్స్ దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ డివి.శ్రీనివాస్‌రావు హోంగార్డుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్య, ఆర్ధికపరంగా ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకరావాలన్నారు. విధి నిర్వహణలో పోలీసుల ఇమేజ్‌ను పెంచేలా అందరి మన్ననలు పొందాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తించి, సమయ పాలన పాటించాలన్నారు. అందరూ యూనిఫాం విధిగా ధరించాలని, ఎలాంటి డ్యూటీల్లోనైనా హోంగార్డులకే ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఓఎస్‌డి శ్రీనివాస్‌రావు, ఆర్‌ఐ అడ్మిన్ శ్రీనివాస్, హోంగార్డుల ఆర్‌ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కుల వివక్షను నిర్మూలించేందుకే బహుజన బతుకమ్మ
*అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ విమలక్క
తుర్కపల్లి, సెప్టెంబర్ 21: మండలంలోని గంధమళ్ల గ్రామంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం బహుజన బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ విమలక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీసాగర్ చెరువు వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆట పాటల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ కుల వివక్షతను నిర్మూలించేందుకు గ్రామ గ్రామాన బహుజన బతుకమ్మలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ పరిరక్షణ కమిటి రాష్ట్ర కన్వీనర్ కల్లూరి రామచంద్రారెడ్డి, గంధమళ్ల సర్పంచ్ వెంకట్‌రెడ్డి, గ్రామ మహిళలు పాల్గొన్నారు.