నల్గొండ

అండర్ పాస్ నిర్మించకపోవడం వల్లే ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, సెప్టెంబర్ 21: జిఎంఆర్ సంస్థ అండర్‌పాస్ నిర్మించకపోవడం వల్లే మండలంలోని ఇనుపాముల జంక్షన్ వద్ద నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బిజెపి శాసనసభ పక్షానేత కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన హైద్రాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదాల బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శనగోని వెంకన్నగౌడ్, గ్రామస్థుల కోరిక మేరకు నిత్యం ప్రమాదాలకు నిలయమవుతున్న ఇనుపాముల వై జంక్షన్‌ను పరిశీలించారు. జిఎంఆర్ సంస్థ వారు జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మించకపోవడం వల్లే ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదంలో 35 మంది మరణించగా 90 మంది అంగవైకల్యానికి గురైయారన్నారు. ప్రమాదాలు జరుగుతున్న దృశ్య త్వరగా అండర్‌పాస్ నిర్మించాలని ఎన్‌ఎ హెచ్‌ఎఐ పిడి శైలజతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. ఈనెల 24న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హైద్రాబాద్‌కు రానున్నందున ఇనుపాముల వై జంక్షన్ సమస్యను వివరించి త్వరలో అండర్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు యానాల శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చెరుకు రోశయ్య, అంజయ్యగౌడ్, అనిత, సురేష్, వెంకన్న, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

2019లో అధికారమే లక్ష్యంగా పని చేయాలి
*ఎఐసిసి సభ్యురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి

చౌటుప్పల్, సెప్టెంబర్ 21: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పని చేయాలని ఎఐసిసి సభ్యురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లోని రాజీవ్ స్మారక భవన్‌లో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఓబిసి మండల కమిటీ అధ్యక్షుడుగా ఎన్నికైన చిదుగుళ్ల లింగస్వామికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న దగాకోరు విధానాలు, ప్రజావ్యతిరేక కార్యక్రమాలు, మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేయాలన్నారు. పార్టీ కోసం పట్టుదలతో పని చేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు. విభేదాలను పక్కనబెట్టి ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న టిఆర్‌ఎస్, ఎన్డీయేలను ప్రతిఘటించేందుకు ప్రజలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడిందన్నారు. ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ వైపే ప్రజలు దృష్టి మళ్లించారన్నారు. ఇదే అదునుగా భావించి ప్రజలకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు కార్యోణ్ముఖులు కావాలని పాల్వాయి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు పాశం సంజయ్‌బాబు, నాయకులు కొండ యాదగిరి, తిరుపతి రవీందర్, చింతల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.