నల్గొండ

ప్రజాదరణ ఉంటే రాజీనామాలు చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 26: టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరుతున్నారన్న మాటలు నిజమైతే పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామాలు చేయించి మళ్లీ గెలిపించుకోవాలని మంత్రి జి.జగదీష్‌రెడ్డికి నల్లగొండ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు అధికారంలో టిఆర్‌ఎస్ పార్టీనే ఉన్నందునా గెలుపు ఓటములకు భయపడకుండా మీకు దమ్ముంటే పార్టీ ఫిరాయింపుదారులతో రాజీనామాలు చేయించి మళ్లీ ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు. జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్‌తో పార్టీ మారిన ఇతర ప్రజాప్రతినిధులతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. జిల్లాలో ఫిరాయింపులకు ఆద్యులు జానా, గుత్తాలే అంటూ మంత్రి జగదీష్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. 35సంవత్సరాలు ప్రజాజీవితంలో కొనసాగుతూ 17ఏళ్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్‌రెడ్డికి లేదన్నారు. జానారెడ్డి తన పదవులకు రాజీనామా చేసి ఆనాడు పార్టీ మారడం జరిగిందన్నారు. అలాగే తాను కూడా టిడిపి నుండి కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఎలాంటి పదవుల్లో లేనని తెలంగాణపై చంద్రబాబుతో విబేధించి వైఎస్సార్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరిన సంగతి మంత్రి జగదీష్‌రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. జానారెడ్డి, కాంగ్రెస్ సీనియర్లు జిల్లాకు చేసిందేమి లేదంటు మంత్రి చేసిన విమర్శలు సైతం అర్ధరహితంగా ఉన్నాయని కాంగ్రెస్ నిర్మించిన సాగర్ ప్రాజెక్టు, ఎడమకాలువ, ఎఎమ్మార్పీ ప్రాజెక్టులతో జిల్లా ప్రజలకు తాగుసాగునీటి వసతి లభిస్తున్న సంగతి మరువరాదన్నారు. టిఆర్‌ఎస్ 18నెలల పాలనలో కొత్తగా ఒక్క చుక్క తాగుసాగునీరందించ లేదన్నారు. జిల్లాలో 1110మంది స్థానిక ఓటర్లలో కేవలం 138మంది బలం ఉన్న టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిని పోటికి నిలిపి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తు ఓటర్లను బెదిరింపులకు, ప్రలోభాలకు గురి చేస్తు గెలువాలని చూస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులు నీతినిజాయితీలతో ఆత్మప్రబోధంతో ఎమ్మెల్సీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని కోరారు. అక్రమ మార్గాలతో ఎన్నికల్లో గెలువాలని చూస్తున్న టిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గుత్తా కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు అధికార పార్టీ ఆగడాలను అరికట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవడం హర్షనీయమని ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం రాంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, కొండేటి మల్లయ్య, కామే సత్యనారాయణ పాల్గొన్నారు.