నల్గొండ

ఇందిరమ్మ రైతు బాటకు కోమటిరెడ్డి బ్రదర్స్ దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 22: తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఇందిరమ్మ రైతు బాట-అవగాహాన సదస్సులు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరు వేదికలుగా, కాంగ్రెస్ వర్గపోరు వేదికలుగా నిలుస్తుండటం చర్చనీయాంశమైంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిల వ్యవస్థను ఎండగడుతు పిసిసి చీఫ్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారధ్యంలో సెప్టెంబర్ 18నుండి డిసెంబర్ 28వరకు 100 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించనున్న ఇందిరమ్మ రైతు బాట సదస్సుల్లో భాగంగా గురువారం సూర్యాపేటలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సోదరుడు ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డిలు గైర్హాజరయ్యారు. బ్రదర్స్‌ను సూర్యాపేట సదస్సుకు ఆహ్వానించకుండా మరోసారి వారిని ఉత్తమ్ దూరం పెట్టినందునే వారు సదస్సుకు రాలేదని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం సాగుతోంది. ఇటీవల శంషాబాద్ పార్టీ కార్యకర్తల శిక్షణ తరగతుల్లోనూ బ్రదర్స్‌ను ఉత్తమ్ వేదికపైకి ఆహ్వానించకపోవడం, వేదికపైన ఉన్న ఇతర పార్టీ సీనియర్లు సైతం దీనిపై ఉత్తమ్‌కు సూచనలివ్వకపోవడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ సమావేశం మధ్యలోనే వెళ్లిపోవాల్సివచ్చింది. మరోసారి సూర్యాపేట సదస్సులోను ఇదే సీన్ రిపీట్ కావడంతో కోమటిరెడ్డి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. సూర్యాపేట సదస్సులో బ్రదర్స్ మినహా పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా సహా కాంగ్రెస్ జిల్లా, రాష్ట్ర ముఖ్యనాయకులు సిఎల్పీ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మల్లు రవి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, పాల్వాయి స్రవంతిరెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్‌లు హాజరయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సదస్సుకు రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో, రైతుల్లో కాంగ్రెస్ వర్గపోరును మరోసారి చర్చనీయాంశం చేసింది. జిల్లా కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకవైపు ఉత్తమ్, జానా, దామోదర్‌రెడ్డి తదితరులు మరోవైపు అన్నట్లుగా పార్టీ సాగుతుంది.
భయపెడుతున్న వర్గపోరు
కాంగ్రెస్ బలోపేతంగా ఉన్న నల్లగొండ జిల్లాలో సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే లక్ష్యంతో నల్లగొండ పార్లమెంటు ఉప ఎన్నికకు టిఆర్‌ఎస్ స్కెచ్ వేస్తుందన్న ప్రచారం సాగుతున్న నేపధ్యంలో జిల్లాలో ఉత్తమ్, కోమటిరెడ్డి వర్గాల మధ్య వైరం పెరిగిపోవడం కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. ఉప ఎన్నికలే వస్తే కాంగ్రెస్ నుండి ఓ వర్గం నాయకుడు పోటీ చేస్తే మరోవర్గం నుండి సహకారం లభించడం అనుమానంగానే ఉండనుంది. తెలంగాణలో అధికార సాధన దిశగా కాంగ్రెస్‌ను నడిపించాల్సిన సారధి ఉత్తమ్ పార్టీలో అందరిని కలుపుకుపోని పక్షంలో ఎన్నికల్లో పార్టీకి వర్గపోరు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. తమను పార్టీ కార్యకలాపాలకు దూరం పెడుతున్న ఉత్తమ్‌ను పిసిసి చీఫ్‌గా తొలగించేందుకు పార్టీలోనే ఉండి పోరాడుతూ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తామని బ్రదర్స్ చెబుతున్నారు. అయితే బ్రదర్స్ ఎంతకాలం ఈ వైఖరిని అనుసరిస్తారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అటు సూర్యాపేట ఇందిరమ్మ రైతుబాటు సదస్సుకు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులను, రైతులను సమీకరించలేకపోయినప్పటికి జిల్లాల వారిగా ఈ సదస్సుల నిర్వాహణతో జనం మధ్యకు వెళ్లి టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతుండటం పార్టీకి మేలు చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.