నల్గొండ

పండ్ల తోటల సాగను ప్రొత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 22: నల్లగొండ జిల్లాలో పండ్ల తోటల సాగును ప్రొత్సహించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించి అమలుకు కృషి చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా ఉద్యాన వన శాఖ జిల్లా మానిటరింగ్ కమిటీ సమావఏశంలో ఆయన మాట్లాడుతు జిల్లాలో పండ్ల తోటల అభివృద్ధికి అమలవుతున్న పథకాల వివరాలతో నివేధిక అందించాలన్నారు. జిల్లాలో 2017-18సంవత్సరానికి వివిధ పథకాల కింద నూతనంగా తోటలు సాగు చేయడానికి 16.20లక్షలతో 144.30హెకార్లు, ఒక ఫామ్‌ఫాండ్ ఏర్పాటు చేయడానికి 75వేలు, షెడ్ నెట్ హౌజ్ వేయడానికి 35.50లక్షలు, ప్రీఫ్యాబ్రికెటేడ్ పాక్ హౌజ్‌లు పదింటికి 20లక్షలు, రైఫినింగ్ చాంబర్‌కు 35లక్షలు, మూడు సోలార్ కోల్డ్ రూమ్‌లకు 22.50లక్షలు, 12ఎక్స్‌ప్రోజర్ విజిట్స్‌కు 72వేలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. డ్రిప్ ఇరిగేషన్ 2211హెక్టార్లలో వేయడానికి 2155.00లక్షలు, స్ప్రింక్లర్లు 501హెక్టార్లలో ఏర్పాటు చేసేందుకు 64లక్షలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. లక్ష్యాల సాధనకు వీలుగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. పండ్ల తోటలకు అందించే డ్రిప్, స్ప్రింక్లర్లు ఇతరు పరికరాలను నాణ్యమైనవిగా ఉండేలా చూడాలని నాసిరకం పరికరాలు అందించే కంపనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారిని ఎంపిక చేయాలని లోటుపాట్లు తలెత్తితే అధికారులపై చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 62,297ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగవుతున్నాయని, వీటి ద్వారా 28లక్ష 5,588మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తున్నాయన్నారు. బత్తాయి 43వేల 298ఎకరాల్లో సాగువుతుండగా 1లక్ష 95వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. నిమ్మ 15,213ఎకరాల్లో సాగవుతుండగా 68,461టన్నుల దిగుబడులు వస్తున్నాయన్నారు. జామ 118ఎకరాల్లో సాగవుతుండగా 588మెట్రిక్ టన్నుల దిగుమడి, మామిడి 2,481ఎకరాల్లో సాగవుతుండగా 8,683టన్నులు, దానిమ్మ 675ఎకరాల్లో సాగవుతుండగా 2,679టన్నులు, ఇతర పండ్ల తోటలు 516ఎకరాల్లో సాగవుతుండగా 1,333మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తున్నాయన్నారు. జిల్లాలో వివిధ రకాల పూల తోటలు 328ఎకరాల్లో సాగుచేస్తుండగా 1,595మెట్రిక్ టన్నుల దిగుబడి, 5,585ఎకరాల్లో వివిధ కూరగాయల పంటలు వేయగా 49,629టన్నుల దిగుబడి వస్తుందన్నారు. మిర్చి 2248ఎకరాల్లో సాగు చేస్తుండగా 2,691మెట్రిక్ టన్నుల దిగుమడి, మల్భారి 159ఎకరాల్లో సాగు చేస్తుండగా 95మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. పండ్ల తోటల ప్రోత్సహాక పథకాలను రైతులకు అందించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన వన శాఖ డిడి సంగీతలక్ష్మి, జెడిఏ నరసింహరావు, జడ్పీ సీఈవో హనుమానాయక్, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యం, శైలజ, ఆదర్శ రైతులు, కంపనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి యోగా పోటీల్లో
కె.వి విద్యార్థిని లుబ్నకు ద్వితీయ స్థానం
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 22: మిర్యాలగూడ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయానికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని ఎండి.లుబ్నకు ఇటీవల భోపాల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిందని ప్రిన్సిపల్ కె.శ్రీనివాసరావు తెలిపారు. అండర్-14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన యోగా పోటీల్లో రెండో స్థానంలో నిలిచి జాతీయ పోటీలకు ఎంపికైందన్నారు. విద్యార్ధినిని, అదే విధంగా యోగా కోచ్ శ్రీనును ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రావు అభినందించారు.
భూ నిర్వాసితుల నుండి స్టేట్‌మెంట్ల స్వీకరణ
మర్రిగూడ, సెప్టెంబర్ 22: చర్లగూడెం రిజర్వాయర్ పరిధిలో భూములను కోల్పోతున్న శివన్నగూడెం రైతులు తమ భూములకు సంబంధించిన స్టేట్‌మెంట్లను శుక్రవారం తహశీల్దార్ బిఆర్.అంబేద్కర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ భూ నిర్వాసితుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఎకరాకు 4.10 లక్షల నుండి 5.15 లక్షలకు పెంచిందన్నారు. పెంచిన పరిహారాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు భూములకు సంబంధించిన స్టేట్‌మెంట్లను ఇవ్వడం జరిగిందన్నారు. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములను ఇచ్చి రైతులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పాశం సురేందర్‌రెడ్డి, శివన్నగూడెం గ్రామ రైతులు పాల్గొన్నారు.
ఆప్ మండల కార్యదర్శిపై దాడి
నకిరేకల్, సెప్టెంబర్ 22: శాలిగౌరారం మండల పరిధిలోని ఊట్కూరు గ్రామంలో ఆప్ గౌరారం మండల కార్యదర్శి ఎంపల్లి పురుషోత్తంరెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఎలేటి సాగర్ అతని అనుచరులు దాడి చేశారని ఈదాడిలో అతను తీవ్రంగా గాయపడగా మొదట నకిరేకల్‌కు అనంతరం హైద్రాబాద్‌కు చికిత్స నిమిత్తం తరలించినట్లు ఎస్సై అయోద్య తెలిపారు. కాగా పురుషోత్తంరెడ్డిపై దాడిని ఆప్ జిల్లా కార్యదర్శి లింగిడి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అతని అనుచరుల అక్రమాలను, ఆగడాలను బహిర్గతం చేసినందుకే రాజకీయ కక్ష పెంచుకొని పురుషోత్తంరెడ్డిపై దాడి చేశారన్నారు.
రోడ్డు ప్రమాదంలో 10 మందికి గాయాలు
అడ్డగూడూరు, సెప్టెంబర్ 22: మండల పరిధిలోని చిర్రగూడూరు గ్రామ శివారులో లారీని టవేరా వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో 10 మందికి గాయాలైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సూర్యాపేటలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రైతుబాటకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో టవేరాలో ప్రయాణిస్తున్న మోత్కూర్ మండలానికి చెందిన 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వీరిలో సుధాకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్ధితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సంఘటన స్ధలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.