నల్గొండ

డబుల్ ఢమాకా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 22: ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు, రైతులకు మేలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రెండు కీలక నిర్ణయాలు వెలువరించింది. ఇందులో కరీంనగర్, ముల్కనూర్ డెయిరీలతో పాటు నల్లగొండ-రంగారెడ్డి జిల్లా మదర్ డెయిరీ పరిధిలోని పాడి రైతులు కోరినట్లుగా లీటర్ పాలపై నాలుగు రూపాయల ప్రోత్సాహాకాన్ని నేటి నుండి అమలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంతో మదర్ డెయిరీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఆయా డెయిరీల పరిధిలోని 2లక్షల మంది పాడి రైతులకు ఆర్ధిక లాభం చేకూరనుండటంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విజయా డెయిరీ మాదిరిగా తమకు కూడా నాలుగు రూపాయల ఇనె్సంటీవ్ కోసం ఇటీవల భువనగిరిలో యువ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి సారధ్యంలో పాడి రైతులు భారీ ఆందోళనే నిర్వహించారు. పాడి రైతుల్లో తీవ్రమవుతున్న ఆందోళనను గమనించిన ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి సమస్యను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి నాలుగు రూపాయల ఇంటెన్సివ్ మంజూరుకు కృషి చేశారు. పాడి రైతులతో ఈ నెల 17న ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ సమావేశమైన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నల్లగొండ మదర్ డెయిరీ రైతులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకం నేటి నుండి మంజూరు చేస్తున్నట్లుగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించడం పట్ల పాడి రైతుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అటు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇండస్ట్రీయల్ పార్కుకు రెండో విడతగా మరో 25కోట్లు కేటాయించడంతో పార్కు నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం(టిఐఎఫ్) రెండో విడతగా 25కోట్లు టిఎస్ ఐఐసికి చెల్లించనుంది. సంబంధిత చెక్కును నేడు టిఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి నేడు శనివారం టిఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండి ఈవి.నరసింహారెడ్డిలకు అందించనున్నారు. దండు మల్కాపురంలో 376ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఇండస్ట్రీయల్ పార్కు తెలంగాణ రాష్ట్రంలో తొలి ఇండస్ట్రీయల్ పార్కుగా నిర్మితంకానుంది. ఈ పార్కు నిర్మాణంతో ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.