నల్గొండ

మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 22: 2017-19 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని మొత్తం 276 దుకాణాలకు ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా సాగింది. సదరు జిల్లాల కలెక్టర్లు గౌరవ్ ఉప్పల్, సురేంద్రమోహన్, అనితారామచంద్రన్‌లు లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. లాటరీ ప్రక్రియను బయట ఉన్న వారు తిలకించేందుకు వీలుగా భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు. పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది లాటరీ ప్రక్రియ సందర్భంగా ఇబ్బందులు లేకుండా రోజంతా శ్రమించారు. నల్లగొండ టౌన్ హాల్‌లో నిర్వహించిన లాటరీ ప్రక్రియ కారణంగా ఈ మార్గంలో వెళ్లే బస్సులను, వాహనాలను శివాజీనగర్ మీదుగా దారి మళ్లించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 276దుకాణాలకు 6986దరఖాస్తులు అందాయి. నల్లగొండ జిల్లాలో 138దుకాణాలకు 2,812దరఖాస్తులు రాగా, సూర్యాపేట జిల్లాలో 71దుకాణాలకు 3043, యాదాద్రి భువనగిరి జిల్లాలో 67దుకాణాలకు 1130దరఖాస్తులు అందగా వాటికి లాటరీ నిర్వహించి లైసెన్స్‌ల జారీ చేశారు. నూతన మద్యం దుకాణాల లైసెన్స్‌లు ఆక్టోబర్ 1వ తేది నుండి అమల్లోకి రానున్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీని అనుసరించి ఉమ్మడి జిల్లా పరిధిలోని 276మద్యం దుకాణాల ద్వారా 264కోట్ల 20లక్షలు ఆదాయం, లైసెన్స్ దరఖాస్తుల ద్వారా 2కోట్ల 76లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది.