నల్గొండ

పండుగొచ్చింది.. కూలీ డబ్బులిప్పించండి !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 23: రెక్కాడితేగాని డొక్కాడని కూలీ బతుకులు.. మూడు నెలలుగా మాకు చేసిన పనులకు కూలీ డబ్బులివ్వడం లేదు.. దసరా పండుగొచ్చింది.. వేలల్లో జీతాలుండే ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతనాలిస్తున్నారంటా.. మాకు పండుగ వేళ పిండి వంటలకైనా డబ్బుల్లేవని వెంటనే తమకు కూలీ డబ్బులిప్పించాలని ఉపాధి హామీ కూలీలు అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద కూలీ పనులు చేసిన ఉద్యోగులు మూడు నెలలుగా కూలీ డబ్బుల కోసం ఎదురుచూపులు పడుతున్నారు. రాష్ట్ర ఖజానా చెల్లింపులపై ప్రభుత్వం ఆంక్షలు, కేంద్రం నుండి రాష్ట్రానికి 250 కోట్ల మేరకు ఉపాధి హామీ నిధులు పెండింగ్‌లో ఉండటంతో జిల్లాల్లో కూలీలకు మూడు నెలలుగా వేతనాల చెల్లింపు సాగడం లేదు. ఏకంగా ఉమ్మడి జిల్లాలో కూలీలకు 33కోట్ల వేతన బకాయిలు పేరుకుపోయాయి. కూలీలు వేతన బకాయిల కోసం నిత్యం మండల పరిషత్, గ్రామీణాభివృద్ధి కార్యాయాలు, పోస్ట్ఫాసుల చుట్ట కూలీలు ప్రదక్షిణలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాల్లో 18.70కోట్లు, సూర్యాపేట జిల్లాలో 10.70, 3.60కోట్ల మేరకు ఉపాధి హామీ పథకం కూలీల వేతన బకాయిలు పేరుకుపోయిన తీరు సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది.
తగ్గిపోతున్న కూలీల హాజరు..!
ఉపాధి హామీ పథకానికి ఎన్‌డిఏ ప్రభుత్వం హయాంలో సకాలంలో నిధుల విడుదల జరుగకపోతుండటం పథకం పనుల పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 15రోజుల వ్యవధిలో ఉపాధి కూలీ డబ్బులు చెల్లించాల్సివుండగా నెలల తరబడిగా కూలీ ఇవ్వకపోవంతో కూలీలు పల్లెల నుండి మళ్లీ వలసబాట పడుతున్నారు. దీంతో ఉపాధి పనులకు కూలీల హాజరు రానురాను తగ్గిపోతోంది. ఇటీవల ఒక్కో రోజు 20వేల మందికిపైగా కూలీలు ఉపాధి పనులకు రాకుండా ఇతర పనులకు వెళ్లిపోతున్నారు. ఇటీవల పత్తి చేనుల్లో పనికి వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఐనప్పటికి ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో 60శాతం మేరకు పనిదినాల కల్పన సాగిన వేతన బకాయిలు కోట్లలో పెండింగ్‌లో ఉండటం కూలీల జీవనాన్ని దుర్భరంగా మారుస్తోంది. ఇప్పటిదాకా 2017లో నల్లగొండలో 1,74,195 కుటుంబాలకు 3లక్షల 10వేల మందికి 60 లక్షల పనిదినాలతో ఉపాధి కల్పించారు. ఇప్పటికే 72.28 కోట్లు వేతనాలు చెల్లించామని, సామాగ్రి రూపేణ 23.61కోట్లు చెల్లించామని డిఆర్‌డిఏ అధికారులు చెబుతున్నారు. పెండింగ్ వేతనాల కోసం ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు అందిన వెంటనే కూలీలకు వేతనాలు మంజూరవుతాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 95వేల మంది కూలీలకు 16లక్షల 65వేల పనిదినాలతో వేతనాలకు 23.96కోట్లు, సామాగ్రీ రూపేణ 9.52కోట్లు చెల్లించారు. సూర్యాపేట జిల్లాల్లో 2లక్షల 70వేల మందికి 54లక్షల పనిదినాలతో 68.91 కోట్లు వేతనాలు, సామాగ్రీ రూపేణ 11.99కోట్లు చెల్లించారు. పెండింగ్ వేతనాలను 32కోట్లు చెల్లించిన పక్షంలో దసరా పండుగ వేళ తమ ఇళ్లలో ఎంతో కొంత ఆనందం ఉంటుందని ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకుని వేతన బకాయిలు చెల్లించాలని ఉపాధి కూలీలు కోరుకుంటున్నారు.