నల్గొండ

వడదెబ్బతో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, ఏప్రిల్ 20: వడదెబ్బతో గొర్రెలకాపరి మృతిచెందిన సంఘటన మండలంలోని నీర్నెంల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆవుల అంజయ్య (62) గొర్రెలకాపరిగా జీవనం సాగిస్తున్నాడు. రోజువారిగా బుధవారం ఉదయం గొర్రెలను తోలుకుని వెళ్లాడు. గ్రామశివారులోని తూమ్‌బాయి సమీపంలో గొర్రెలు మేపుతుండగా ఎండతీవ్రతకు అపస్మారకస్థితిలో పడిపోయాడు. అంజయ్య పరిస్థితిని గమనించిన ఇరుగుపొరుగు రైతులు ఇంటికి తీసుకవచ్చెసరికే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి బార్య లక్ష్మమ్మ, కూమారుడు యాదగిరి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అంజయ్య మృతదేహాన్ని జిఎంపిఎస్ జిల్లా నాయకులు కల్లూరి మల్లేషం, సర్పంచ్ ఏభూషి నర్సింహ్మ, మాజీ సర్పంచ్ బోయిని ఆనంద్ సందర్శించి నివాళులు అర్పించారు. వడదెబ్బతో మృతిచెందిన గొర్రెలకాపరి అంజయ్య కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కోరారు.
కంచనపల్లిలో...
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 20: నల్లగొండ మండలంలోని కంచనపల్లి గ్రామంలో చేపూరి శ్రీకాంత్‌రెడ్డి(35) అనే వ్యక్తి వడదెబ్బతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు వివరాలలోకి వెళితే శ్రీకాంత్‌రెడ్డి నల్లగొండ పట్టణంలో కంప్యూటర్ దుకానాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ దశలో తన పని నిమిత్తం ఉదయం వెళ్లి సాయంత్రం వస్తుండేవాడు. కాగా మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ నుండి ఇంటికి వచ్చి తీవ్ర అలసటకు గురయ్యాడు. రాత్రి సైతం నీరసంగా ఉండి ఉదయం మృతి చెందాడు. విషయం తెలసుకున్న స్థానిక సర్పంచ్ కాసర్ల విజయారెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరుపున సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గుండాలలో...
గుండాల, ఏప్రిల్ 20: మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన రైతు నల్ల అబ్బసాయిలు(65) వడదెబ్బతో మృతి చెందిన సంఘట బుధవారం చోటు చేసుకుంది. కుంటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రోజువారిగానే పశువులను వ్యవసాయ బావి వద్ద మేపడానికి వెళ్లగా తీవ్రమైన వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారాన్ని రెవిన్యూ అధికారులకు అందించగా వి ఆర్‌వో శ్రీనివాస్ శవ పంచనామ నిర్వహించిన జిల్లా అధికారులకు నివేదికను అందించనున్నట్లు తెలిపారు.