నల్గొండ

పాలిసెట్-2016 ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, ఏప్రిల్ 21: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 2016 గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. వాటిలో నల్లగొండలో 16కేంద్రాలు, సూర్యాపేటలో 7, కొదాడలో 3కేంద్రాలలో ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేశారు. నల్లగొండలో 7వేల 298మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 7వేల 110మంది హాజరయ్యారు. కోదాడలో 2వేల 371మందికి గాను 2వేల 260మంది హాజరయ్యారు. సూర్యాపేటలో 2వేల 436మందికి గాను 2వేల 397మంది హాజరయ్యారు. మొత్తం 12వేల 110మంది ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 11వేల 767మంది ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. జిల్లాకేంద్రంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలోని పరీక్ష కేంద్రాన్ని ఎజెసి వెంకట్‌రావు ప్రవేశ పరీక్ష జరిగే తీరును పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, పాలిసెట్ కన్వీనర్ అల్లం లింగం పలు కేంద్రాలలో ప్రవేశ పరీక్షను పర్యవేక్షించారు.
ఉరుకులు, పరుగులతో విద్యార్థులు
ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం నిబందన ఉండడంతో విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు ఉరుకుల పరుగులతో హాజరయ్యారు. కొంతమంది విద్యార్థులకు సకాలంలో పరీక్షా కేంద్రాలు దొరకపోవడంతోపాటు వేసవి తాపాన్ని ఆసరగా చేసుకుని రిక్షావాలాలు చార్జీలు పెంచి ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల నుండి బాగానే దండుకున్నారు. కొన్ని పరీక్షా కేంద్రాలలో వౌలిక వసతులు కొరతగా ఉన్నాయని విద్యార్థులు వాపోయారు.