నల్గొండ

మూసీ ప్రాజెక్ట్ ఆధునీకరణకు 65.56 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, అక్టోబర్ 17: మూసీ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 65.56 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇరిగేషన్, క్యాడ్ శాఖ నుండి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాజెక్ట్ ఆధునీకరణ, కుడి, ఎడమ కాల్వల ఆధునీకరణ పనులను చేపట్టనున్నారు. సూర్యాపేట సభలో సిఎం కెసిఆర్‌ను మూసీ ఆధునీకరణకు నిధులు విడుదల చేయాలని మంత్రి జగదీష్‌రెడ్డి చేసిన వినతి మేరకు సిఎం నిధులు విడుదల చేయడం పట్ల సూర్యాపేట జిల్లా టిఆర్‌ఎస్ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఆలేరు, అక్టోబర్ 17: మండల కేంద్రంలోని బస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై లారీ బైక్‌ను ఢీకొన్న సంఘటనలో గ్యార సుగుణ(45) అనే మహిళ దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్యార సుగుణ తన భర్త ఏలియాతో జనగాం జిల్లా చిన్నరామచర్ల గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామమైన పటేల్‌గూడెంనకు వస్తుండగా బస్ స్టేషన్ ఎదురుగా వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొనడంతో సుగుణ కింద పడి తల ఛిద్రమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ఏలియాకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆలేరు ఎస్‌ఐ నర్సింహులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
అక్రమంగా నిల్వ చేసిన వంట నూనె సీజ్
నల్లగొండ టౌన్, అక్టోబర్ 17: పట్టణంలోని రామగిరి సాయికిరణ్ ఏజెన్సీ అక్రమంగా నిల్వ చేసిన పలు కంపెనీల వంట నూనెలను మంగళవారం డీఎస్‌వో ఉదయ్‌కుమార్ సీజ్ చేశారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీ నిర్వాహకులు రంగా సత్యనారాయణ 5,448 లీటర్ల వంట నూనె అక్రమంగా నిల్వ చేశారన్న సమాచారం అందడంతో తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. స్టాక్‌కు సంబంధించి ఎలాంటి రికార్డులు లేకపోవడంతో నిల్వలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రతీ ఒక్క ఆయిల్ డీలర్ ఎప్పటికప్పుడు స్టాక్ రికార్డులను నమోదుచేయాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.