నల్గొండ

అన్నిరకాల తపాలా సేవలు ఇక ఆల్‌లైన్‌లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, అక్టోబర్ 17: తపాలాసేవలు ఇకనుండి ఆన్‌లైన్‌లో జరుగుతాయని, దేశమంతా తపాలాసేవలు కంప్యూటీకరణ చేయనున్నట్లు ఇక అన్నిరకాల తపాలా సేవలను ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని తపాలాశాఖ పిఎంజి ఎలీషా అన్నారు. మండల కేంద్రంలోని తపాలాశాఖలో మంగళవారం తపాలా సేవలను కంప్యూటీకరణ ఆన్‌లైన్ సేవలను జిల్లా ఎస్‌పి వైవి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. తపాలా సేవలను కంప్యూటీకర వివరాలను అందిస్తున్న సేవలను సబ్‌డివిజన్ ఇన్‌స్పెక్టర్ సావిత్రి, స్థానిక పోస్ట్‌మాస్టర్ కేతావత్ లక్ష్మణ్‌లను పిఎంజి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పిఎంజి ఎలీషా మాట్లాడుతూ తపాలాశాఖ అందించే సేవలను కోర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ (సిఎస్‌ఐ) ద్వారా ఆన్‌లైన్ సేవలందిస్తామన్నారు. ఆన్‌లైన్ ద్వారా చేయడంతో తమకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుండవని వేగవంతంగా పనులు పూర్తవుతాయన్నారు. తపాలశాఖలో ప్రభుత్వ చెల్లింపుల కోసం తమ శాఖ ప్రత్యేకంగా పేమెంట్‌బ్యాంకును ప్రారంభించనున్నదని ఈ సేవలు ఈఏడాది డిసెంబర్ 31లోగా పేమెంట్ బ్యాంకు ద్వారా ప్రభుత్వ చెల్లింపులు జరుపనున్నామన్నారు. ఆధార్‌కార్డు, పాన్‌కార్డు ఎన్‌రోల్‌మెంటుతో పాటు అన్నిరకాల ఎన్‌రోల్‌మెంట్లు డిసెంబర్ 31 వరకు చేయబడుందన్నారు. త్వరలో జిల్లా తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవలను ప్రారంభిస్తామన్నారు. పాస్‌పోర్టును పొందేటందుకు ఇక నుండి సులువవుతుందని జిల్లా తపాలా కార్యాలయాల్లో వివరాలను నమోదు చేసుకోవచ్చని సుదూర ప్రాంతాలకు వెళ్ళే సమయం ఆదా అవుతుందన్నారు. జిల్లా ఎస్‌పి వైవి కృష్ణారావు మాట్లాడుతూ తపాలా సేవలను వినియోగించుకునే వారికి ఆన్‌లైన్ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయని సేవలు కూడా సులభతరం కానున్నాయన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రషీద్, నీల యాదగిరి, నరేష్, ఓరుగంటి మహేష్ పాల్గొన్నారు.

చెట్ల పెంపకానికి భూముల పరిశీలన
*ఎంపి బూర నర్సయ్యగౌడ్

బీబీనగర్, అక్టోబర్ 17: ఈత, తాటి చెట్ల పెంపకం కోసం స్థలాలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వ భూములను భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ పరిశీలించారు. మంగళవారం మండలంలోని జైనపల్లి గ్రామంలో 268 సర్వే నెంబర్లో 9ఎకరాలు, నెమురగొమ్ల గ్రామంలో 49 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూములను ఎంపి నర్సయ్యగౌడ్ ఎంపిక చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన భూములలో ఈత, తాటిచెట్లను పెంచి గీత కార్మికుల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. చెట్ల పెంపకం కోసం ఎంపి నిధులతో బోర్లు, మోటార్లు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వై.అశోక్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల అశోక్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తంతరపల్లి అంజయ్యగౌడ్, నెమురగొమ్ల సర్పంచ్ సంకూరి మీరాబాయి, గీతా కార్మిక సంఘం అధ్యక్షుడు మొరిగాడి బాలమల్లేశ్‌గౌడ్, గీతకార్మికులు రాజు, చంద్రయ్య, జంగయ్య, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, సర్వేయర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.