నల్గొండ

సాంకేతిక సమస్యలతో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 17: ఎస్‌ఎల్‌బిసి సొరంగం మార్గం పనుల్లో సిఎం కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటు బిజెఎల్పీ బృందం చేసిన విమర్శలు అర్ధరహితం, అసత్యాలని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఖండించారు. మంగళవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనులను సందర్శించిన బిజెఎల్పీ బృందం టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పనుల్లో జాప్యం సాగుతుందంటు విమర్శంచడం వారి అవగాహన రాహిత్యాన్ని చాటుతుందన్నారు. త్రవ్వకాల్లో భాగంగా టిబిఎం మిషన్లు మరమ్మతులకు గురవుతుండగా వాటి మర్మమతులకు కనీసం ఆరు నెలలు పడుతుండటంతో సొరంగం తవ్వకంలో సాంకేతిక సమస్యలతో జాప్యం సాగుతుందన్నారు. టిబిఎం మిషన్లు పాత మోడల్ కావడంతో వాటితో రోజుకు గరిష్టంగా 250మీటర్ల త్రవ్వకమే సాధ్యమవుతుందన్నారు. వాటిని మార్చడం కుదరకపోవడంతో వాటితోనే పనులు జరిపించాల్సివస్తుందన్నారు. గతంలో ఒకసారి వరదల కారణంగా సొరంగంలో నీళ్లు చేరి టిబిఎంలు మునిగి పనులకు ఆలస్యమైందన్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి ఎస్‌ఎల్‌బిసి పనుల పురోగతిని సమీక్షించి కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్‌గా వంద కోట్లు చెల్లించిన సంగతి బిజెపి నాయకులు మరిచిపోయారన్నారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగంతో పాటు ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఉదయ సముద్రం, నక్కలగండి ప్రాజెక్టుల పనులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం వేగవంతం చేసిందంటు గణాంకాలతో గుత్తా వెల్లడించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీని విమర్శించాలన్న లక్ష్యంతో విమర్శలు చేయడం సరికాదన్నారు. లోలెవల్ కెనాల్ పూర్తి చేయగా ఉదయ సముద్రం ప్రాజెక్టును డిసెంబర్ చివరికల్లా పూర్తి చేసేందుకు మంత్రి హరీష్‌రావు చర్యలు చేపట్టారన్నారు. జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు డిండి ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు. మిషన్ భగీరథతో రక్షిత మంచినీటి పథకం అమలవుతుందన్నారు. రాష్ట్భ్రావృద్ధి పట్ల బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదాలు ఇప్పించడంతో పాటు అనుమతులు ఇప్పించాలని గుత్తా డిమాండ్ చేశారు. తెలంగాణకు విభజన చట్టం మేరకు రావాల్సిన హైకోర్టు, ఏయిమ్స్‌లను మంజూరు జరిపించాలన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతుంటే ఇక్కడి బిజెపి పార్టీ ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రం నుండి నిధులు, అనుమతుల మంజూరుకు కృషి చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి పాశం రాంరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు అబ్బగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అమరుల స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయాలి
- జేఏసి జిల్లా కన్వీనర్ పన్నాల గోపాల్‌రెడ్డి
నల్లగొండ టౌన్, అక్టోబర్ 17: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ నెల 21, 22 తేదీల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో జరిగే అమరవీరుల స్ఫూర్తియాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ పన్నాల గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక క్లాక్ టవర్ సెంటర్‌లో అమరవీరుల స్థూపం వద్ద స్ఫూర్తియాత్ర వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ కాంట్రాక్ట్, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. జిల్లా కో కన్వీనర్ పి.సైదులు మాట్లాడుతూ అమరుల స్ఫూర్తి యాత్ర చౌటుప్పల్‌లో ప్రారంభమై సంస్థాన్ నారాయణపూర్, మునుగోడు, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్ మీదుగా నల్లగొండకు చేరుకుంటుందని, ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ బి.కేశవులు, నియోజకవర్గ కన్వీనర్ జి.సురేందర్, గోలి సైదులు, వివిధ సంఘాల నాయకులు పర్వతాలు, అశోక్‌రెడ్డి, విజయ్‌కుమార్, అయోధ్య, వీరనాయక్, ఎన్.బచ్చిరెడ్డి, నాగిళ్ల శంకర్, గోవర్థన్, అశోక్‌కుమార్, కట్ట సైదులు, బివి.చారి, వెంకట్‌రెడ్డి, యాదగిరి చారి తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్లతో ఆత్మగౌరవం, ఆరోగ్యం
*2018 అక్టోబర్ 2నాటికి బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రం *రాష్ట్ర గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ నీతుకుమారిప్రసాద్

భువనగిరి, అక్టోబర్ 17: ఆత్మగౌరవం, ఆరోగ్యంకోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని బహిరంగ మలవిసర్జనను నిర్మూలించాలని, 2018 అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ నీతుకుమారిప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం రాయిగిరి గ్రామంలోని రాధాక్రిష్ణన్‌హాల్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆద్వర్యంలో స్వచ్ఛ్భారత్ మిషన్‌లో బాగంగా జిల్లాలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్పిటిసి, మండల ప్రత్యేక అధికారులకు స్వచ్ఛ్భారత్ మిషన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నీతుకుమారిప్రసాద్ మాట్లాడుతూ స్వచ్చ్భారత్ మిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 250కోట్లు వినియోగించగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 3కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. అదనంగా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యపరిచి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ఇంకుడు గుంతలు, వాటర్‌షెడ్‌లు నిర్మాణాలు చేపట్టాలన్నారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు ఉపాధిహామీ నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపి బూరనర్సయ్యగౌడ్ మాట్లాడుతూ పూర్తయిన మరుగుదొడ్ల నిర్మాణాలకు బిల్లులు చెల్లించకపోవడంవల్ల మేస్ర్తిలు ముందుకు రావడంలేదన్నారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ అనితరామచంద్రన్ మాట్లాడుతూ అక్టోబర్ 2 నాటికి జిల్లాలో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు. జిల్లాలోని 330 గ్రామాలలో ఇప్పటివరకు 53గ్రామ పంచాయతీలను ఒడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. సదస్సు అనంతరం గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ నీతుకుమారి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి వలిగొండ మండలంలోని పులిగిళ్ల గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యాం, బోర్‌వెల్ రిచార్జి స్ట్రక్చర్, ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఈకార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, శాసనమండలి సభ్యుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, డిఆర్‌డిఎ పిడి వెంకట్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

2019 ఎన్నికల్లో అధికారం బిజెపిదే
*పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాచం వెంకటేశ్వర్లు

ఆలేరు, అక్టోబర్ 17: 2019 సాధారణ ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాచం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొలనుపాక గ్రామంలో సుమారు 50 మంది కార్యకర్తలు, నాయకులు బిజెపిలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల దేశానికి ఎంతో మేలు జరిగిందన్నారు. రానున్న రోజుల్లో దేశం ఆర్థికంగా పటిష్టపడి అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు. పార్టీని గ్రామీణ స్థాయిలోకి తీసుకెళ్లి జవసత్వాలు అందించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు జంపాల శ్రీనివాస్, నాయకులు కావడి సిద్ధిలింగం, శ్రీనివాస్, బోగ శ్రీను, బోగ రాజు, పాల్వాయి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.