నల్గొండ

ప్రపంచ శాంతి, లోక కళ్యాణానికే యజ్ఞాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, అక్టోబర్ 21: యజ్ఞయాగాదులు ఎక్కడైతే నిర్వహిస్తారో అక్కడ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. లోక కళ్యాణం కోసం యాదాద్రిలో యజ్ఞం నిర్వహిస్తుండటం మంచి పరిణామమన్నారు. శనివారం యాదగిరిగుట్ట కొండ పక్కన శ్రీ ఆయుత మహావిష్ణు మహాయాగాలను 128 రోజులలో భాగంగా చివరి 20 రోజులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఈ యాగం గత వెయ్యి సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా నిర్వహించలేదని యాగ నిర్వాహాకులు బ్రహ్మాశ్రీ హరిహర నాథశర్మ తెలిపారు. యాగాలలో శనివారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ యజ్ఞ యాగాదులతో దేశం సుభీక్షంగా ఉంటుందని ప్రపంచ శాంతి కోసం యగ్ఞాలు నిర్వహించడం మన దేశంలోనే సాధ్యమన్నారు. నెల రోజుల క్రితం శ్రీశైలం, నాగార్జున సాగర్ నీరు లేక వెలవెల బోయిందని నేడు నిండు కుండలా మారడం యాగ ఫలమేనన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ యాదాద్రిలో ఇంత గొప్ప యాగాలు నిర్వహించటం మామూలు విషయం కాదని అది భగవంతుడి కృపతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాలె సుమలత, ఎంపిపి గడ్డమీది స్వప్న, జడ్పీటిసి కర్రె కమలమ్మ, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.