నల్గొండ

తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 21: శాంతి భద్రతల పరిరక్షణకు తమ విధి నిర్వాహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శ్లాఘించారు. శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో ఆయన అమర పోలీసులకు నివాళులర్పించి మాట్లాడారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతకు తమ ప్రాణాలు అడ్డుపెట్టి పనిచేసే పోలీసుల సేవలు, ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివన్నారు. శాంతియుత సమాజంతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాగుతుందని ఇందుకు పోలీస్ శాఖ చేస్తున్న కృషి కీలకమైందన్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు తీసుకున్న చర్యలతో నేడు తెలంగాణ పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలీస్‌తో, నేరాల నియంత్రణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం నిర్మూలనలో తెలంగాణ పోలీస్, ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్‌లు ధైర్యసాహాసాలు దేశం అభినందనలుచూరగొన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిన తీరు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ సమర్థ పనితీరుకు నిదర్శనమన్నారు. నూతనంగా వస్తున్న ఆధునిక సాంకేతికను పోలీస్ శాఖకు అందిస్తు పోలీస్‌శాఖ మరింత సమర్థవంతంగా ఆత్మవిశ్వాసంతో పనిచేసేలా ప్రభుత్వం ప్రొత్సహిస్తుందన్నారు.
జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విధి నిర్వాహణలో జిల్లా పోలీస్ శాఖ నుండి 29మంది పోలీస్ అధికారులు, సిబ్బంది అమరులయ్యారన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు మంత్రి, ఎస్పీలతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, భాస్కర్‌రావు, కె.ప్రభాకర్‌రెడ్డితో పాటు డిఎస్పీ సుధాకర్, సిఐలు తులా శ్రీనివాస్, ఆదిరెడ్డి, రవిందర్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు అమరవీరులకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. మిర్యాలగూడ మాజీ జడ్పీటీసి దోసపాటి శ్రీనివాస్ పోలీస్ అమరులను కీర్తిస్తు గేయం ఆలపించారు. అనంతరం అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ పరంగా మంజూరైన సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఆర్గనైజర్ మాలే శరణ్యారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేఖల భద్రాద్రి, టిఆర్‌ఎస్ నేతలు దుబ్బాక నరసింహారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.