నల్గొండ

సరస్వతిని గౌరవిస్తేనే సమాజం విజ్ఞానవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 22: చదువుల తల్లి సరస్వతిని గౌరవించుకుంటేనే సమాజం విజ్ఞానవంతమై పురోభివృద్ది సాధిస్తుందని, అదిశగా గ్రంథాలయాల అభివృద్దికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. గ్రం థాలయ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని గాంధీపార్కులో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో కవులు అంటే పెద్దగా గౌరవం లేదని, కవులంటే జోకులు వేసుకునే పరిస్థితులు నెలకొనడం బాధకరమన్నారు. కవిత్వం గొప్పదనం, క వుల ప్రాధాన్యత నేటితరాల వారికి తెలియకపోవడమే ఇందుకు కారణమన్నారు. పఠన ఆసక్తి ప్రతి ఒ క్కరిలో పెంపోందినప్పుడే విజ్ఞానం వికసించి తద్వారా ఉన్నతమైన సమాజం ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. నేడు గ్రంథాలయాలు అ ధ్వాన్నస్థితిలో ఉన్నాయని, వాటి అభివృద్దికి సమాజంలోని ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. తనకు పుస్తకాలన్న, గ్రంథాలయాలు అన్న అమితమైన ప్రేమన్నారు. తన ఇంట్లో ఒక అంతస్తునంతా గ్రంథాలయంగా మార్చి 10వేల పుస్తకాలను సేకరించినట్లు చెప్పారు. తెలుగు సినీ చరిత్రలో పంచె కట్టుకొని ఆస్కార్ అవార్డు అందుకోవాలన్నదే తనకు ఉన్న జీవత ఆశయమన్నారు. వం దేళ్ల ఘన చరిత్ర కలిగిన సూర్యాపేట గ్రంథాలయానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇం తటి ఘన చరిత్ర కలిగిన గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధ్ది చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కవి సమ్మేళనంలో ఉమ్మడి జిల్లాకు చెందిన 100మంది కవులు పాల్గొని తమ కవితలను చదివి విన్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కవులు పెద్దిరెడ్డి గణేష్, వేణు సంకోజు, తల్లవజుల శివాజీ, సౌభాగ్య, కౌన్సిలర్లు తాహేర్, బాణాల విజయ్‌కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.