నల్గొండ

కమీషన్ల కోసమే కాల్వల పనులు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, అక్టోబర్ 22: కమీషన్ల కోసమే టీఆర్‌యస్ ప్రభుత్వం దేవాదుల కాల్వల పనులను అసంపూర్తిగా వదిలివేసిందని డిసిసి అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. ఆదివారం జనగామ జిల్లా గుండాల మండల కేంద్రంలో దేవాదుల పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయ రం గాన్ని దృష్టిలో ఉంచుకొని వందలాది కోట్ల నిధులను దేవాదుల ప్రాజెక్టు పనులకు విడుదల చేసిందన్నారు. సాగు నీటి ఫలాలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ దక్కుతాయోనని టీ ఆర్‌యస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా దేవాదుల పనుల్లో జాప్యం చేస్తుందని విమర్శించారు. దేవాదుల సాగునీరు గుండాల మండలంలోని గ్రామాలకు అందకుండా దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. టిఆర్‌యస్ ప్రభుత్వం అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. అనంతరం గుండాల మండల కేంద్రం నుండి 500 ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరి జనగామ జిల్లా నవాబుపేట దేవాదుల రిజర్వాయర్ పనులను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బబ్బూరి సుధాకర్, పురుగుల మల్లేష్, లింగాల బిక్షం, రమేష్, వెంకటేశ్, పూర్ణ, విశాలాక్ష్మి, శ్రీనివాస్, రాజు, వెంకన్న, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు వామపక్షాలే ప్రత్యామ్నాయం

నల్లగొండ, అక్టోబర్ 22: రాష్ట్ర రాజకీయాల్లో టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు రాజకీయ ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలే నిలబడనున్నాయని, 2019ఎన్నికల్లో వామపక్ష, ప్రజా సంఘాల ఫ్రం ట్ రాష్ట్ర రాజకీయ, పాలన రంగాల్లో మార్పు తీసుకొచ్చే శక్తిగా అవతరిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్‌లో నిర్వహించిన సిపిఎం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతు కేంద్ర-రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి, టిఆర్‌ఎస్‌ల పాలన విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుందన్నారు. ప్రధానీ నరేంద్రమోదీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు, అంఛనాలు తొలగిపోయాయని, జిఎస్‌టి, నోట్ల రద్ధుతో నల్లధనం బయటకురాకపోగా తెల్లధనంగా మారిపోయిందని సామాన్య ప్రజలు కష్టాల పాలయ్యారన్నారు. నల్లధనంతో ప్రతి వ్యక్తి బ్యాంకుఖాతాలో 15లక్షలు వేస్తామని, రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోదీ హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. నోట్ల రద్ధుతో లక్ష కోట్ల నల్లధనం బయటపడకపోగా బిజెపి పార్టీకి అనధికారికంగా లక్షకోట్ల వనరులు సమకూరాయని, అమిత్‌షా కుమారుడి కంపనీలో 16వేల రెట్లు పెట్టుబడులు పెరిగిపోయాయన్నారు. ప్రజాదరణ కోల్పోతున్న బిజెపి మతతత్వ రాజకీయాలపై ఆధారపడి అధికారం కాపాడుకునేందుకు తంటాలు పడుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రభుత్వం సైతం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో, ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై, ఉద్యమించే వారిపై అణిచివేతతో అప్రజాస్వామిక పాలనకు తెగబడిందన్నారు. కోదండరామ్ యాత్రను అడ్డుకోవడం, ధర్నాచౌక్ ఎత్తివేయడం, మిర్చి రైతులకు బేడిలు వేయడం, ప్రాజెక్టుల భూనిర్వాసితులపై పోలీస్ బలగాలను ప్రయోగించడం టిఆర్‌ఎస్ నియంతృత్వ పాలనకు నిదర్శమన్నారు.