నల్గొండ

చెర్వుగట్టులో కార్తీక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, అక్టోబర్ 23: కార్తీక తొలి సోమవారాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రం చెర్వుగట్టులో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై గల దేవాలయంలో మూల విరాట్‌కు తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో తొలి సోమవారం కావడంతో పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మహా మండపంలో మహా దేవుడైన శివుడికి సామూహిక అభిషేకాలు నిర్వహించారు. శివుడికి ఇష్టమైన జిల్లేడు పూలు, మారేడు దళాలతో ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట ఆలయ ఈవో అంజనారెడ్డి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కొండపైకి వచ్చిన భక్తులు కోనేరులో స్నానమాచరించి అనంతరం శివుడిని దర్శించుకున్నారు. మూల విరాట్‌తో పాటు మూడు గుండ్లపైన ఉన్న శివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం వేళలో భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు.
కస్తూర్బా పాఠశాలలో ఖాళీ బియ్యం సంచులపై విచారణ
నాంపల్లి, అక్టోబర్ 23: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల నుంచి సోమవారం 65 ఖాళీ సన్నబియ్యం సంచులను తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. ఈవిషయాన్ని డిఈవోకు ఫోన్‌లో తెలుపగా ఆయన ఎంఇవో గుర్వారావును విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో గుర్వారావు కస్తూర్భా పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ బస్తాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏమైనా అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.