నల్గొండ

ఇంటర్ ఫలితాల్లో జిల్లా లాస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, ఏప్రిల్ 22: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో నల్లగొండ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. గత ఏడాది చివరి స్థానాలనే మళ్లీ నిలబెట్టుకుంది. ఈ దఫా మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 33,775మంది పరీక్షలకు హాజరుకాగా 13,879మంది ఉత్తీర్ణత సాధించి 41శాతం ఫలితాలతో 10వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో 34,355మంది పరీక్షలకు హాజరు కాగా 18,318మంది ఉత్తీర్ణత సాధించి 53శాతం ఫలితాలతో 10వ స్థానంలో నిలిచింది. ఇంటర్ ప్రధమ సంవత్సరంలో మొత్తం 33,775మంది పరీక్షలు రాయగా వారిలో బాలురు 5,740మంది(35శాతం), బాలికలు 8,139మంది(48శాతం), ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ విభాగంలో 34,355మంది పరీక్షలు రాయగా వారిలో బాలురు 8,252మంది(49శాతం), ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 10,066మంది(58శాతం) ఉత్తీర్ణత సాధించారు. గత విద్యా సంవత్సరంలో కూడా ఇంటర్ ఫలితాలలో జిల్లా అథమ స్థానంలోనే నిలిచింది.
వృత్తి విద్యా విభాగంలో
వృత్తి విద్యా విభాగంలో ప్రధమ సంవత్సరంలో 3,966మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 2,333మంది ఉత్తీర్ణత సాధించడంతో 59శాతం ఫలితాలతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. వారిలో బాలురు 2,382మంది పరీక్షకు హాజరుకాగా 1308మంది ఉత్తీర్ణత సాధించగా 55శాతం ఫలితాలు సాధించారు. బాలికలలో 1588మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1025మంది ఉత్తీర్ణత సాధించగా 65శాతం ఫలితాలు సాధించారు.
వృత్తి విద్యావిభాగంలో ద్వితీయ సంవత్సరంలో 3,186మంది పరీక్షలకు హాజరుకాగా 2,257మంది ఉత్తీర్ణత సాధించి 71శాతం ఫలితాన్ని నమోదు చేసి రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలించింది. పరీక్ష రాసిన వారిలో బాలురు 2,039మంది కాగావారిలో 1381మంది విద్యార్థులు ఉత్తర్ణత సాధించి 68శాతం ఫలితాన్ని నమోదు చేశారు. బాలికలు 1147మంది పరీక్షలకు హాజరుకాగా 876మంది ఉత్తీర్ణత సాధించి 76శాతం ఫలితాన్ని నమోదు చేశారు. వృత్తి విద్య ఫలితాలలో గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాన్ని సాధించింది. గత ఏడాది వృత్తివిద్యావిభాగంలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో ఉండగా ఈ ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది.
గత ఐదు సంవత్సరాల ఇంటర్ ఫలితాల సరళి ఇలా
రామగిరి, ఏప్రిల్ 22: ఇంటర్ ప్రధమ సంవత్సరం 2010-11విద్యా సంవత్సరానికి సంబందించి 43,314మంది పరీక్షలక హాజరుకాగా వారిలో 15,181మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 35శాతం ఫలితాన్ని నమోదు చేశారు. 2011-12లో 43,273మంది పరీక్షలకు హాజరుకాగా 19,233మంది ఉత్తీర్ణత సాధించి 44శాతం ఫలితాన్ని నమోదు చేయగా 2012-13లో 44,538మంది పరీక్షలకు హాజరుకాగా 18,768మంది ఉత్తీర్ణత సాధించి 42శాతం ఫలితాన్ని నమోదు చేయగా 2013-14లో 39,134మంది హాజరుకాగా 17516మంది ఉత్తీర్ణత సాధిమచి 45శాతం ఫలితాన్ని నమోదు చేయగా 2014-15లో 41,519మంది పరీక్షలకు హాజరుకాగా 18,041మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 43శాతాన్ని నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరంలో 2010-11విద్యా సంవత్సరానికి సంబందించి 37,573మంది పరీక్షలకు హాజరుకాగా 18,171మంది ఉత్తీర్ణత సాధించి 48శాతం ఫలితాన్ని నమోదు చేయగా 2011-12లో 39.020మంది పరీక్షకు హాజరుకాగా 20,915మంది ఉత్తీర్ణత సాధించి 54శాతం ఫలితాన్ని నమోదు చేశారు. 2012-13లో 40,723మంది పరీక్షలకు హాజరుకాగా 21,193మంది ఉత్తీర్ణత సాధిమచి 52శాతం ఫలితాన్ని నమోదు చేయగా 2013-14లో 40,749మంది పరీక్షలకు హాజరుకాగా 22,170మంది ఉత్తీర్ణత సాధిమచి 54శాతం ఫలితాన్ని నమోదు చేయగా 2014-15లో 36,381మంది పరీక్షకు హాజరుకాగా 18,796మంది ఉత్తీర్ణత సాధించి 52శాతం ఫలితాన్ని నమోదు చేశారు.
ఫలితాల్లో వీరే టాప్
రామగిరి: ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపిసి విభాగంలో నల్లగొండ గీతాంజలి కళాశాల విద్యార్ధిని ఎండి.సబీనా 440/436మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఎంపిసి విభాగంలో గౌతమి జూనియర్ కళాశాలకు చెందిన కె.అక్షర్‌రెడ్డి, విద్వాన్ కళాశాల విద్యార్ధి ఎన్.కల్యాణ్‌కుమార్‌లు 470/466మార్కులతో సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో ప్రగతి కళాశాల విద్యార్ధి నవీన్ 989మార్కులతో బైపిసిలో రాష్ట్ర స్థాయి రెండో స్థానంలో దక్కించుకున్నారు.