నల్గొండ

నీటిగండంగా మారిన సాగర్ కాల్వ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలియా, నవంబర్ 17: హాలియాలో సాగర్ ఎడమకాల్వ రోజురోజుకు నీటిగండంగా మారి కాల్వలోకి దిగితే ప్రాణాలకు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు ఘటనలో కాల్వలోకి దిగిన ఇద్దరు ప్రమాదబారిన పడగా మహిళను స్థానికులు రక్షించారు. మరో వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకపోయి గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన లక్ష్మమ్మ స్థానిక ఆంజనేయస్వామి గుడి ఎదురుగా హోటల్ నడుపుకుంటూ జీవిస్తుంది. శుక్రవారం ఉదయం సమయంలో బట్టలు ఉతకడానికి పక్కనే ఉన్న సాగర్ కాల్వకు వెళ్లింది. ప్రమాదవశాత్తు జారి కాల్వలోకి కొట్టుకపోతుండగా గమనించిన సమీపంలో ఉన్న అయ్యప్పస్వాములు, స్థానికులు సురక్షితంగా ఆమెను ఒడ్డుకు చేర్చి వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరో సంఘటనలో పెద్దవూర గ్రామానికి చెందిన జంగాల చంద్రయ్య(50) మధ్యాహ్నం సమయంలో కాల్వలోకి దిగి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. చంద్రయ్య ఆచూకి కోసం గాలిస్తున్నామని వారు తెలిపారు. చంద్రయ్య కుమారుడు జంగాల రాజేశ్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీశ్ తెలిపారు. కాగా ఒకేరోజు రెండు ప్రమాదాలు జరగడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్వ మెట్ల వద్ద ఎవరూ కాల్వలోకి దిగకుండా కంచెను ఏర్పాటుచేసి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు. మహిళ లక్ష్మమ్మను రక్షించిన స్థానిక పాల వ్యాపారి నాగేందర్, ఆటోడ్రైవర్ సీతారాములను హాలియా సీఐ ధనుంజయగౌడ్ అభినందించారు