నల్గొండ

కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, నవంబర్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సాయిగణేశ్ ఫంక్షన్‌హాల్‌లో 6వ మండల మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నోట్లరద్దు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే పౌరసరఫరాలను నిలిపివేసి నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుందని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా రేషన్ డీలర్లు సమ్మె చేస్తున్న పట్టించుకునే నాథుడేలేడని, గత పది రోజులకు కనీస వేతనాలు చెల్లించాలని సమ్మె చేస్తున్న సెర్ప్ కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు పట్టించుకునేందుకై కనీస నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో చీరిక శ్రీశైలంరెడ్డి, ఏలె కృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి మహ్మాద్ జహాంగీర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు వేముల మహేందర్, కల్లూరి మల్లేశం, కొమ్మిడి లక్ష్మారెడ్డి, సుర్కంటి వెంకట్‌రెడ్డి, తుర్కపల్లి సురేందర్, పబ్బతి మల్లేశం, సిర్పంగి స్వామి, కందాడి సత్తిరెడ్డి, కూర శ్రీనివాస్, గర్థాసు నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

భూ రికార్డుల ప్రక్షాళనను వేగవంతం చేయాలి
*జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి
తిప్పర్తి, నవంబర్ 17: భూ రికార్డుల ప్రక్షాళనను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిప్పర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. రైతులు, ప్రజలు తమ భూ రికార్డుల్లో ఏమైనా తప్పులుంటే అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. తొలి దశలో ఎలాంటి భూ వివాదాలు లేని రికార్డులను సరిచేయాలన్నారు. అనంతరం తిప్పర్తి సబ్ మార్కెట్ యార్డును పరిశీలించి ధాన్యం కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులందరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు ధాన్యం చెల్లింపులు త్వరితగతిన చేపట్టాలన్నారు. సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు. తిప్పర్తి బైపాస్ పనులు త్వరలోనే వేగవంతమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పందిరి వెంకటేశ్వర్ మూర్తి, ఎంపీడీవో జగదీశ్వర్‌రావు, మార్కెట్ సూపర్‌వైజర్ మధుబాబు, తిప్పర్తి సర్పంచ్ జాకటి మోష, ఉప సర్పంచ్ వడ్డెపల్లి జానకిరాములు, ఆర్‌ఐ అర్జున్‌రావు, నాయకులు తండు నర్సింహగౌడ్, కందుల లక్ష్మయ్య, కృష్ణారావు, వీఆర్‌వో రహీంపాషా, లావణ్య తదితరులు పాల్గొన్నారు.