నల్గొండ

చెర్వుగట్టులో కార్తీక సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, నవంబర్ 17: తెలంగాణ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన చెర్వుగట్టు క్షేత్రాన్ని సందర్శించి జడల రామలింగేశ్వరుడికి పూజలు చేయాలన్న సంకల్పం, కార్తీక మాసం చివరి రోజు కావడంతో పలు జిల్లాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో చెర్వుగట్టు కిక్కిరిసిపోయింది. కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయన్న పురాణాల ఆచారం ప్రకారం భక్తులు శివుడి క్షేత్రానికి చేరుకొని కొండపై గల కోనేరులో స్నానమాచరించి స్వామి దర్శనం కోసం పోటీపడ్డారు. తెల్లవారుజామునే భక్తులు కొండకు తరలిరావడంతో రహదారులన్నీ వాహనాలతో నిండిపోగా, కొండ జనసముద్రంగా మారింది. తెల్లవారుజామునే జడల రామలింగేశ్వరుడికి పంచామృతాలతో ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా మండపంలో భక్తులచే సామూహిక అభిషేకాలు, ప్రసాద విక్రయశాల సమీపంలో గల మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. జడల రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. కొండపై ఎటూ చూసినా శివనామ స్మరణతో మారుమ్రోగింది. శివసత్తుల పూనకాలు, ఎల్లమ్మ బోనాలతో కొండ కార్తీక మాస సందడిని సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రసాద విక్రయానికి అదనపు కౌంటర్ తెరిచారు. కొండపై గల అన్నదాన సత్రంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిపారు. అదే విధంగా కొండ కింద గల పార్వతీ దేవి ఆలయంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. చెర్వుగట్టులో గల వాసవీ నిత్యన్నదాన సత్రంలో నెలకొని ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి దేవికి కార్తీక చివరి శుక్రవారం కావడంతో అభిషేకాలు, వస్తల్రంకరణ, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ నిర్వాహణ అధికారి అంజిరెడ్డి, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, చెర్వుగట్టు నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడు రంగా నర్సయ్య, గౌరవ సలహాదారులు రంగా సీతయ్య, ఎల్లారెడ్డిగూడెం ఆర్యవైశ్య నిత్యన్నదాన సత్రంలో జరిగిన వేడుకల్లో అధ్యక్షుడు రంగా కృష్ణయ్య, నిర్వాహకులు మీలా సోమయ్య, రంగా శేఖర్, పసునూరి శ్రీనివాస్, యాద శ్రీనివాస్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

బీసీ వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా అధికారులు
* ఆంధ్రభూమి వార్తకు స్పందన * వారం రోజుల్లో నీటి సమస్యను తీరుస్తామని హామీ

తుంగతుర్తి, నవంబర్ 17: ఈనెల 16న ఆంధ్రభూమి దినపత్రికలో ‘వారు దయతలిస్తేనే స్నానాలు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ వెనకబడిన తరగతుల బాలుర వసతిగృహన్ని శుక్రవారం జిల్లా డీడీ నరేందర్‌రెడ్డి, సహయక అధికారి శంకర్‌నాయక్, డీఈ అశోక్‌కుమార్, తదితరులు సందర్శించారు. దాదాపు కిలోమీటర్ దూరంలో ఉండి పాడైపోయిన బోరుని, ధ్వంసమైన నీటి పైపులను వారు పరిశీలించారు. బోరుని వెంటనే బాగుచేసి వారం రోజుల్లో నీటి సమస్యను తీరుస్తామని ఈ సందర్బంగా డీడీ నరేందర్‌రెడ్డి విలేఖరులకు తెలిపారు. ముఖ్యంగా వసతి గృహంలో నీటి సమస్య దారుణంగా ఉన్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. పక్కనే ఉన్న ఎస్టీ వసతి గృహం నుండి తాత్కాలికంగా నీటిని తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు అక్కడి నిర్వాహకులతో మాట్లాడినట్లు తెలిపారు. ముఖ్యంగా ఉన్న దాదాపు నాలుగున్నర లక్షల రూపాయల నిధుల నుండి నీటి సమస్యని తీర్చడంతోపాటు వసతిగృహంలో అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ సరఫరాని మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి ఆర్.బుజంగం, తదితరులు పాల్గొన్నారు.