నల్గొండ

అప్పులు, అధోగతి పాలైతున్న తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, నవంబర్ 18: ఎందరో యువకులు ప్రాణత్యాగంతో చలించిన ఏఐసిసి అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేయగా నక్క వినయానికి మారు పేరైనా కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతికి గురి చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ అన్నింటిలో మోసం, వంచనకు పాల్పడుతున్నారన్నారు. 35 వేల కోట్లతో పూర్తి చేయవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన నీటి ప్రాజక్టులకు 4లక్షల కోట్లు వ్యయం చేస్తున్నారని, 2014లో 20 వేల కోట్లతో మిగులుగా ఉన్న తెలంగాణ నేడు 1లక్షా 30 వేల కోట్ల అప్పులలో ఉందని అన్నారు. 4వేల మంది రైతులు మరణించినా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరిని పరామర్శించలేదన్నారు.
తెలంగాణలో రైతుల ముఖాలలో చిరునవ్వు ఉన్ననాడే బంగారు తెలంగాణ అని, కానీ ఒక్క నల్లగొండ జిల్లాలోనే గత 3 సంవత్సరాలలో 360 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్త అల్‌దాస్ జానయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ 2014లో రాష్ట్రంలో 107 లక్షల ఆహర ధ్యాన్యాలు ఉత్పతి కాగా 2016లో 96లక్షల టన్నులకు తగ్గాయని, 2014లో 85లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట వేయగా 2016లో కూడా అంతే విస్తీర్ణంలో వేశారని, 2014లో 45 లక్షల బేళ్ల పత్తి దిగుబడి రాగా 2017లో 37 లక్షలకు పడిపోయిందని వివరించారు. సమావేశంలో రాష్ట్ర ఐయన్‌టియుసి ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు యండి నిజాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, మంజూనాయక్, రాజారెడ్డి, టి మల్లికార్జునరావు, అమర్‌నాధ్‌రెడ్డి, మర్ల శ్రీనివాసు, 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు పాల్గొన్నారు.