నల్గొండ

వారివి గోడ దూకుడు రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, నవంబర్ 18: ప్రతీ నిత్యం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జిల్లా కాంగ్రెస్ పెద్దలు అవాకులు చెవాకులు పేల్చడం విస్మయం కలిగిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నార్కట్‌పల్లిలో రోడ్డు పనులను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్‌రెడ్డి తనదైన శైలిలో ప్రసంగిస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు చురకలు అంటించారు. అసెంబ్లీలో మాట్లాడమని కాంగ్రెస్ నేతలకు మైక్ ఇస్తే.. బయట తేల్చుకుందామంటూ తప్పించుకోవడం, బయటకు వచ్చి చర్చకు సిద్ధమంటే అసెంబ్లీలో మాట్లాడదామని గోడ దూకుడు పని చేస్తున్న పెద్దలకు ప్రజలే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని ఘాటుగా విమర్శించారు. తరచూ సమావేశాల్లో ఉత్తమ్, జానా, కోమటిరెడ్డిలు ముఖ్యమంత్రి కేసీఆర్ బడి కట్టాడా, బడిలో బాత్‌రూం కట్టాడా, పాకలేశారా అంటూ పనికి మాలిన ఆరోపణలు చేస్తున్న నేతలు 30 ఏళ్లుగా తమ నియోజకవర్గాలను ఏలి ఎన్ని పాఠశాలలను అభివృద్ధి చేశారో తేల్చుకోవాలన్నారు. ఆంధ్ర పాలకుల అడుగులకు మడుగులొత్తి కాంట్రాక్టులు కైవసం చేసుకొని సొమ్ము చేసుకునే నేతలు ఆ రోజుల్లో జిల్లా అభివృద్ధి గురించి పట్టలేదా అని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా కనీసం 30 శాతం అభివృద్ధి చేయలేని మీరు మూడేళ్లలో అంతకు రెట్టింపు స్థాయిలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు గొప్పలు కోసమో, కాంట్రాక్టుల కోసమే బ్రాహ్మణవెల్లెంలలో ప్రారంభించిన ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తిచేయకపోతే సీఎం కేసీఆర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రతీ నిత్యం ప్రాజెక్టు పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని, అలాంటి క్రమశిక్షణ కలిగిన సీఎంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. మూడేళ్లలో జిల్లాలో పవర్ ప్లాంట్, ఉదయసముద్రం పనుల వేగవంతంతో పాటు అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామన్నారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ నేతలు చేసిన అభివృద్ధి ఏమిటో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో ఒక గ్రామంలో ప్రారంభమైన ఫ్లోరిన్ మహమ్మారిని నాడే తుంచివేసేందుకు ఆనాడు పరిపాలించిన నేతలు చర్యలు తీసుకుంటే నేడు ఆ వ్యాధి జిల్లా వ్యాప్తంగా విస్తరించేది కాదని, ఈ పాపం కాంగ్రెస్, టీడీపీ నేతలది కాదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రజల గోసను చూసి ఫ్లోరిన్ రక్కసి నుండి రక్షించాలన్న ధృడ సంకల్పంతో ప్రాజెక్టులు పూర్తి చేసి అట్టి గ్రామాలకు జనవరిలోగా సురక్షిత తాగునీరు అందించబోతున్నామని, ఇది చేసి నిరూపిస్తామని పదే పదే ప్రకటించారు. అభివృద్ధి చేయలేక ఘోరంగా విఫలమైన సీనియర్ శాసన సభ్యులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు జడ్పీ చైర్మన్ బాలునాయక్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మా భూములు లాక్కొవద్దు
అధికారుల బృందాన్ని అడ్డుకున్న రైతులు
* కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
సూర్యాపేట, నవంబర్ 18: అభివృద్ధి పనుల పేరుతో గతంలో తమకు పంపిణీ చేసిన భూములను లాక్కొవద్దంటూ శనివారం జిల్లాకేంద్రం శివారులోని నల్ల చెర్వు వద్ద రైతులు అధికారుల బృందాన్ని అడ్డుకున్నారు. జిల్లాకు నూతనంగా మంజూరైన మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న స్థలాలను ప్రతిపాధించేందుకు గాను రాష్ట్ర వైద్యవిద్యా సంచాలకులు డాక్టర్ రమేష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్, సూర్యాపేట మెడికల్ కళాశాల నోడల్ అధికారి డాక్టర్ దండ మురళీధర్‌రెడ్డిలతో పాటు పలువురు అధికారులు జిల్లాకేంద్రంలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. అదేవిధంగా జిల్లాకేంద్రం శివారులోని ఎస్వీ కళాశాల వెనుక భాగంలో నల్లచెర్వు వద్ద సర్వే నెంబర్ 671లో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు వెళ్లిన అధికారుల బృందాన్ని గతంలో పట్టాలు పొందిన రైతులు అడ్డుకున్నారు. అధికారుల వాహనాలకు ముందు బైఠాయించి అభివృద్ధి పేరుతో తమకు కేటాయించిన భూములను లాక్కొవద్దంటూ నినాదాలు చేశారు. నిరుపేదలమైన తమకు ప్రభుత్వం గతంలో భూములను పంపిణీ చేసిందని నేడు పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరుతో వాటిని తిరిగి తీసుకోవాలని చూస్తే తాము ఉపాదులు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు ఇచ్చిన భూముల్లో ఏ నిర్మాణాలను చేపట్టనివ్వమన్నారు. దీంతో కలెక్టర్ సురేంద్రమోహన్ ఆందోళనకారుల వద్దకు చేరుకొని మీకు ఉన్న అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో పాటు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.