నల్గొండ

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, నవంబర్ 19: అకాల వర్షాలతో పంట నష్టపోయిన పత్తి, వరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. ఆదివారం మండలంలోని భీమనపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు పి.కరుణాకర్ అధ్యక్షతన పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని కోరారు. బీజేపీని బలోపేతం చేసేందుకు మండలంలోని నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎర్ర వెంకటేశ్వర్లు, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుకొండల్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నర్సింహా, నర్సింహాచారి, సత్యనారాయణ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
అక్కంపల్లిని గ్రామపంచాయతీ
చేయాలంటూ ఎమ్మెల్యేకు వినతిపత్రం
వలిగొండ, నవంబర్ 19: మండలంలోని రెడ్లరేపాక గ్రామం పరిధిలో గల అక్కంపల్లి గ్రామాన్ని గ్రామపంచాయతీగా చేయాలంటూ ఆదివారం నాడు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మాద శంకర్‌గౌడ్, కొమిరెల్లి సంజీవరెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
21న బస్‌పాస్‌ల పంపిణీ
మర్రిగూడ, నవంబర్ 19: ఈ నెల 21న మర్రిగూడలోని బస్టాండ్‌లో బస్‌పాస్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నల్లగొండ డీఎం సురేష్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు, వికలాంగులకు బస్‌పాస్‌లను పంపిణీ చేయడంతో పాటు వనిత, క్యాట్ కార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
పానగల్‌లో పారిశుద్ధ్యం అధ్వాన్నం: నూకల
నల్లగొండ టౌన్, నవంబర్ 19: మున్సిపాల్టీ పరిధిలోని పానగల్‌లో పారిశుధ్య వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 10,11 వార్డుల్లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పానగల్ వడ్డెర వాడతో పాటు పలు ప్రాంతాల్లో మురికికాల్వల్లో పూడికను తొలగించకపోవడంతో మురుగు నీరు వీధులు, ఇళ్లలోకి చేరడంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి పానగల్‌లో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, కార్యదర్శి గడ్డం మహేష్, నాయకులు మిర్యాల గిరి, గణేష్, శేషు, ఉదయ్, సాయి, మహేష్, సందీప్, భాను, సంతోష్, సతీష్ పాల్గొన్నారు.
వైభవంగా శ్రీవేణుగోపాలుడి కల్యాణం
నార్కట్‌పల్లి, నవంబర్ 19: వావిజాల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలుడి కల్యాణం కన్నులపండువగా జరిగింది. ఆదివారం జరిగిన కల్యాణ మహోత్సవంలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. మండల కేంద్రంలో నెలకొని ఉన్న ఈ ఆలయంలో కల్యాణం జరుగుతుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. తాళి కట్టే సమయంలో, తలంబ్రాలు వేసే సమయంలో వేదోక్తంగా భక్తులకు ప్రవచనం తెలుపుతూ కార్యక్రమం నిర్వహించడంతో భక్తుల హృదయాలను రంజింపజేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండల్‌రెడ్డి, ధర్మకర్త శ్రీనివాస్, సర్పంచ్ పుల్లెంల అచ్చాలుగౌడ్, పసునూరి రవీందర్, విజయలక్ష్మి, కళావతి, బండారు ధనలక్ష్మి, టీఆర్‌యస్ మండల అధ్యక్షుడు సట్టు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.