నల్గొండ

నేడు టిడిపి రైతు దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 19: రైతాంగం సమస్యల సాధనకు టిడిపి నేడు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు రైతు దీక్షకు సిద్ధమైంది. టిడిపి సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పర్యవేక్షణలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాగుతున్న రైతు దీక్షకు టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు ఇతర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. ఇటీవల పార్టీ నుండి రేవంత్‌రెడ్డి వెంట జిల్లాకు చెందిన సూర్యాపేట, నల్లగొండ పార్టీ అధ్యక్షులు పటేల్ రమేష్‌రెడ్డి, కె.బిల్యానాయక్, కంచర్ల భూపాల్‌రెడ్డిలు కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లో చేరిన నేపధ్యంలో దెబ్బతిన్న పార్టీకి నూతన జవసత్వాలు నింపి క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపే దిశగా రైతు దీక్షకు టిడిపి నాయకత్వం పిలుపునిచ్చింది. అయితే ఈ రైతు దీక్షకు మరో సీనియర్ నాయకురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె తనయుడు యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డిలు దూరంగా ఉండటం ఆ పార్టీకి మరో షాక్‌నిస్తుంది. వారిద్ధరు తాజాగా సీఎం కెసిఆర్‌ను కలువడం, పార్టీ మారే ఆలోఛన చేస్తుండటంతో పాటు మోత్కుపల్లితో ఉన్న విబేధాల నేపధ్యంలో నేటి రైతు దీక్షకు వారు దూరంగా ఉండనున్నారు. అయితే ఇప్పటికే మోత్కుపల్లి సారధ్యంలోని టిడిపి శ్రేణులు మూడు జిల్లాల నుండి రైతులను, కార్యకర్తలను భారీగా సమీకరించేందుకు వారం రోజులుగా రైతు దీక్ష విజయవంతం కోసం విస్తృత ప్రచారం సాగించారు.
ట్రాన్స్‌కో పనితీరుపై మండల సభ ఆగ్రహం
తుర్కపల్లి, నవంబర్ 19: ట్రాన్స్‌కో అధికారుల పనితీరుపై మండల సభలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సమావేశంలో ట్రాన్స్‌కో శాఖనుద్దేశించి పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. గ్రామాల్లో లూజ్ వైర్ల కారణంగా స్కీం బోరు మోటార్లు తరచూ కాలిపోతున్నాయని సభ దృష్టికి తీసుకవచ్చారు. లూజ్ వైర్లు తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని తిరుమలాపురం సర్పంచ్ చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో లూజ్ వైర్లను తొలగించేందుకు స్తంభాలు వేసినా.. వాటికి వైర్లు ఏర్పాటుచేయలేదని ఎంపీటీసీ తలారి శ్రీనివాస్ అన్నారు. బిల్లుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ విద్యుత్ సరఫరాపై చూపించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు అధ్వాన్నంగా ఉందని, ఏమాత్రం సమయ పాలన పాటించడం లేదని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు హరినాయక్ అన్నారు. గ్రామాల్లో చేపడుతున్న మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణం ఇష్టారీతిగా జరుగుతుందని, తీసిన గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచులు ప్రకాశ్, ఆంజనేయులు తెలిపారు. వ్యవసాయ శాఖపై సమీక్ష జరగ్గా.. గ్రామాల్లో ఎవరికీ తెలియకుండానే రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేశారని, వెంటనే కమిటీలను రద్దు చేయాలని సభలో పలువురు సర్పంచులు డిమాండ్ చేశారు. డాక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో గర్భిణులు పీహెచ్‌సీలో పేర్లు నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీవో జలేంధర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమారాణి, కో ఆప్షన్‌మెంబర్ ఎండి.యాకుబ్, ఈవోపీఆర్‌డీ చంద్రవౌళీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.