నల్గొండ

ఓడిఎఫ్ జిల్లా సాధనలో భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 19: జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత(ఓడిఎఫ్) జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం యంత్రాంగం చేస్తున్న కృషిలో సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కోరారు. ఆదివారం కలెక్టరేట్‌లో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లతో తేనేటి విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు గ్రామాల్లో ప్రజలతో నేరుగా సర్పంచ్‌లకు ఉంటే సంబంధాలను వినియోగించుకుని అందరు మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఓడిఎఫ్ జిల్లా సాధన బాధ్యతను సామాజిక బాధ్యతగా గుర్తించాలని, ఓడిఎఫ్ పంచాయితీగాలు నిలిచిన వాటికి జనవరి 26న నగదు అవార్డు, జ్ఞాపికతో పాటు ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యతనిస్తామన్నారు. ఓడిఎఫ్ సర్పంచ్‌లను ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాల సర్పంచ్‌లు ముందుకురావాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో ప్రభుత్వ అందిస్తున్న సహాయం, ప్రజలను చైతన్యవంతంచేసే తీరును కలెక్టర్ వివరించారు. జిల్లాలోని 502గ్రామ పంచాయితీల్లో 70పంచాయితీలు ఓడిఎఫ్‌గా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఓడిఎఫ్ పంచాయితీల సర్పంచ్‌లను కలెక్టర్ ఘనంగా సర్ట్ఫికెట్లు అందించి శాలువలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డివో పిడి ఆర్. అంజయ్య, డిపివో గోపాల్, డిపిఆర్‌వో నాగార్జున, ఎస్‌బిఎం కమిటీ సభ్యులు వి.హనుమంతు, వసంత, ఎంపిడివోలు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.