నల్గొండ

ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, నవంబర్ 19: దివ్యాంగులు తమ అంగవైకల్యాన్ని ఆత్మస్థైర్యంతో అధిగమించి జీవితంలో నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనలో ముందడుగు వేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రం మేకల అభినవ్ ఇండోర్ స్టేడియంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల అండతో విద్య, ఉపాధి రంగాల్లో రాణించాలన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రాధాన్యతనిస్తుందన్నారు. దివ్యాంగుల క్రీడా పోటీల నిర్వాహణ ద్వారా వారిలో అంగవైకల్యం భావనను దూరం చేసి ఆత్మస్థైర్యాన్ని, మానసిక ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. ఈసంద్భంగా చెస్, క్యారమ్, ట్రైసైకిల్ రన్నీంగ్ తదితర విభాగాల్లో దివ్యాంగులకు పోటీలు నిర్వహించగా వాటిలో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా మహిళా కోఆర్డీనేటర్ మాలే శరణ్యారెడ్డి, ఐసిడిఎస్ పిడి పుష్పలత, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, డిఎస్‌డివో మక్భుల్ అహ్మద్, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ సూపరిండెంట్ నర్సింగ్‌రావు, యాదయ్య, సత్యనారాయణ, శ్రీహరి, సందీప్ పాల్గొన్నారు.
మహిళా సాధికారిత దిశగా కృషి చేయాలి
* కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి, నవంబర్ 19:మహిళలు అన్ని రంగాలలో రాణిస్తు మహిళా సాధికారత దిశగా కృషి చేయాలని యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన మహిళా దినోత్సవాన్ని కలెక్టర్ అనితారామచంద్రన్ జ్యోతిప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ మహిళలు స్వతంత్రంగా అభివృద్ధి చెందడమే కాకుండా తోటి మహిళలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారిత కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయని వాటిని సద్వినియోగం చేసుకుని మహిళాసాధికారితను సాధించాలన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షీటీమ్‌ను ప్రవేశపెట్టడం అభినందనీయమని తెలిపారు. మహిళల కోసం ప్రజాసంఘాలు, ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాల పట్ల తోటి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్యశ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ జయశ్రీ, మల్లికారాణి, మహాలక్ష్మి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సహకరించాలి
* ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే రవీంద్రకుమార్
చింతపల్లి, నవంబర్ 19: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతులు ప్రభుత్వానికి సహకరించాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పర్యవేక్షణ కార్యాలయ నిర్మాణం కోసం మండల కేంద్రంలో 70 లక్షలు, మండలంలోని మాల్‌లో 62 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన కార్యాలయ నిర్మాణానికి ఆదివారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు రైతులను సమన్వయపరిచి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా సహకరించాలన్నారు. ఎకరాకు 5.15 లక్షలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందు కోసం రైతులు సహకరించాలని కోరారు. స్థానిక మార్కెట్ యార్డులో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 20 గుంటల భూమిని కేటాయించేందుకు హామీ ఇచ్చారు. అనంతరం మాల్ ఉన్నత పాఠశాలలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంచీలను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ రమేష్‌కుమార్, పీఏసీయస్ చైర్మన్ సంజీవరెడ్డి, ఎన్.గిరిధర్, కిష్టారెడ్డి, భాస్కర్, అశోక్, విద్యాసాగర్‌రావు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గౌడల అభివృద్ధికి కృషి: ఎంపీ బూర
నల్లగొండ టౌన్, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ కార్తీక వన భోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గౌడ కులస్తులందరూ ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లోనూ రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బోయపల్లి లక్ష్మణ్‌గౌడ్, సుంకరి బిక్షంగౌడ్, వంగాల స్వామిగౌడ్, కటికం సత్తయ్యగౌడ్, బండి సాయన్నగౌడ్, పల్లె రవికుమార్, కాకునూరి నారాయణగౌడ్, నకిరేకంటి కాశయ్యగౌడ్, సురిగి మారయ్యగౌడ్, ఎరుకల సత్తయ్యగౌడ్, కిశోర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.