నల్గొండ

కెమికల్ పరిశ్రమ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, నవంబర్ 21: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కెమికల్ పరిశ్రమ ఎస్.వి.ల్యాబ్స్ విస్తరణ పనులకు అనుమతులు ఇవ్వొద్దంటూ కొయ్యలగూడెం గ్రామస్థులు, యువకులు మంగళవారం కొయ్యలగూడెం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టండి ఆందోళన చేశారు. గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు. కొయ్యలగూడెం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం, పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రామ సర్పంచ్, ఎంపిటిసి, పాలకవర్గం సభ్యులను నిలదీశారు. ఇప్పటికే కెమికల్ పరిశ్రమల ఏర్పాటుతో భూగర్భజలాలు పూర్తిగా కలుషితమై ప్రజలు, పశుపక్షాదులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయని, తాగేందుకు నీళ్లను కొనుగోలు చేసుకోవలసిన దుస్థితి నెలకొందన్నారు. ఎల్‌వి. ల్యాబ్ విస్తరణ జరిగితే మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ యువజన సంఘాల ఆధ్వర్యంలో జేఏసి, గ్రామస్థులతో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసారు. పరిశ్రమ విస్తరణ పనులను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ముట్టడి కార్యక్రమంలో పద్మజ్యోతి, ఆదర్శ, శాంతి, అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

నల్లగొండ మున్సిపాల్టీకి స్కోచ్ అవార్డు
నల్లగొండ టౌన్, నవంబర్ 21: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా జీఐఎస్ ద్వారా సర్వే చేపట్టిన నల్లగొండ మున్సిపాల్టీకి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు వరించింది. ఈ నెల 9న ఢిల్లీలో పురపాలక డిప్యూటీ డైరెక్టర్ త్రిలేశ్వర్, సర్వే చేపట్టిన సంస్థ డైరెక్టర్ విశాల్ అవార్డు జ్యూరీ సభ్యులకు జీఐఎస్ ప్రాజెక్ట్ ఉపయోగాలు, మున్సిపాల్టీకి పెరిగే ఆదాయం గురించి వివరించడంతో ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తించి జ్యూరీ సభ్యులు ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ప్రకటించారు. వచ్చే నెల 20, 21 తేదీల్లో స్కోచ్ సంస్థ 50వ వార్షికోత్సవ సదస్సులో ఈ అవార్డును అందజేయనున్నారు. స్కోచ్ అవార్డు రావడం పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ వాలీబాల్ పోటీలకు దివ్య ఎంపిక
కట్టంగూర్, నవంబర్ 21: వచ్చే నెలలో రాజస్థాన్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలకు మండలపరిధిలోని బొల్లెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 7వతరగతి విద్యార్థిని రుద్రాక్షి దివ్య ఎంపికైంది. నవంబర్ 18 నుండి మూడు రోజుల పాటు భద్రచలంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి నల్గొండ జిల్లా జట్టును ప్రథమస్థానంలో నిలిపింది. దీంతో ఆమెను రాష్ట్రం తరుపున జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. 5వ తరగతి నుండే వాలీబాల్ శిక్షణ తీసుకున్న దివ్య ఒకే సంవత్సరంలో రాష్టస్థ్రాయి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైయ్యేలా పీఈటీ బ్రహ్మయ్య ప్రత్యేక శిక్షణనిచ్చారు. జాతీయ పోటీలకు ఎంపికైన దివ్యను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందిమళ్ల నరేందర్‌రెడ్డి ఎస్‌ఎంసీ చైర్మన్ పులి జయసుధ, ఉపాధ్యాయులు విజయ్‌కుమార్, ధర్మాంగ, రవీందర్‌రెడ్డి, యాదయ్య, అన్నపూర్ణ, బాబురావులు అభినందించారు.