నల్గొండ

ఉద్దీపనను పకడ్బందీగా అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, నవంబర్ 21: అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ఉద్దీపన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. నకిరేకల్ నియోజకవర్గంలో చేపడుతున్న ఉద్దీపన కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థిలో స్పష్టమైన మార్పు తీసుకవచ్చే విధంగా ఉద్దీపనను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అందించేందుకు నిర్వహిస్తున్న ఉద్దీపన కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలుచేయాలన్నారు. ఉద్దీపన కార్యక్రమంలో అన్ని స్థాయిల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేసి విజయవంతమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రజాప్రతినిధులను, అధికారులను, ఉద్యోగులు, ఉపాధ్యాయులను సమన్వయపరిచి ఉద్దీపన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్దీపనకు జిల్లా యంత్రాంగం నుంచి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఆంగ్లమాధ్యమ బోధనకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్‌ఐఆర్‌డీ సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఎన్‌ఐఆర్‌డీ అసోసియేట్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ అందించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్దీపన అమలుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో అంజయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి నరోత్తమ్‌రెడ్డి, డైట్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, డైట్ ఫ్యాకల్టీ మల్లారెడ్డి, కట్టంగూరు జడ్పీటీసీ ఎం.యాదగిరి, నార్కట్‌పల్లి ఎంపీడీవో సురేష్, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.