నల్గొండ

24న యాదాద్రికి సీఎం కెసిఆర్ రాక..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 21: సీఎం కెసిఆర్ ఈ నెల 24న యాదాద్రి క్షేత్రానికి రానున్నట్లుగా అనధికారికంగా తెలుస్తోంది. యాదాద్రిలో జరుగునున్న టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర నాయకుడు తంగబాలు పెళ్లికి ఆయన హాజరవుతారని ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులు పరిశీలిస్తారని స్థానికంగా ప్రచారం సాగుతుంది. అయితే సీఎం యాదాద్రి రాకపై అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం అందలేదు. యాదాద్రి అలయ అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నాయన్న విమర్శల నేపధ్యంలో పనుల పరిశీలనపై సీఎం ఆసక్తి చూపిన పక్షంలో ఆయన యాదాద్రి పర్యటన ఉండవచ్చని భావిస్తున్నారు. 2018మార్చి బ్రహ్మోత్సవాల్లోగా ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం కెసిఆర్ వైటిడిఏ అధికారులను ఆదేశించారు. అయితే శిల్పాల తయారీ, తరలింపు, నిర్మాణం, రోడ్ల నిర్మాణాలు, భూసేకరణ వంటి వాటితో పాటు నవగిరుల అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం సాగుతుంది. ఆలయ అభివృద్ధి పనులు సాగుతుండటంతో ఏడాదిన్నర కాలంగా బాల ఆలయంలోనే స్వామి వారి దర్శనాలు, బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. గత దసరా నాటికే స్వామి గర్భాలయంలోనే దర్శనాలు పునఃప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా పనుల్లో జాప్యంతో అది సాధ్యం కాలేదు. వచ్చే బ్రహ్మోత్సవాలకు కూడా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని సందర్శించి పనుల్లో వేగం పెంచేందుకు సీఎం కెసిఆర్ యాదాద్రి సందర్శన ఉపయోగపడుతుందని భక్తులు భావిస్తున్నారు. దాదాపు 800కోట్ల అంఛనాతో చేపట్టిన యాదాద్రి ఆలయం, నవగిరుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇప్పటిదాకా కెసిఆర్ ప్రభుత్వం 400 కోట్లు కేటాయించారు. మొదటి ఏడాది 100కోట్లు, తదరుపరా 200కోట్లు, ఈ ఏడాది మరో 100కోట్లు కేటాయించి విడుదల చేశారు. మరో 400కోట్లు విడుదల చేసి పనుల వేగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని వైటిడిఏ ప్రతిపాదించింది.

సర్వేల్ నుంచే గ్రామ ప్రణాళికలు రూపొందిద్దాం
*నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్‌ఆర్ దవే

సంస్థాన్‌నారాయణపురం, నవంబర్ 21: గ్రామాభివృద్ధికి, రైతుల స్వయం సమృద్ధికి సర్వేల్ గ్రామం నుంచే ప్రణాళికలు రూపొందిద్దామని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్‌ఆర్ దవే పిలుపునిచ్చారు. మండలంలోని సర్వేల్ గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం రైతు ఉత్పాదక సంఘాలు, పంచాయతీ పాలకవర్గంతో హెచ్‌ఆర్ దవే, జిల్లా కలెక్టర్‌తో కలిసి సమావేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా థాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు ఉత్పాదక సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. కొందరు రైతులకు రూపే కార్డును అందజేశారు. రైతులు స్వయం సమృద్ధిని సాధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలపాలని కోరారు. గుజరాత్ రాష్ట్రంలో రైతులంతా కలిసి ఒకే చోట పాడిపరిశ్రమ, కోళ్ళు, ఇతర వ్యవసాయోత్పత్తులను, మార్కెటింగ్‌ను చేపడుతారని తెలిపారు. దీనికి కొంత రైతులు చెల్లిస్తే మరికొంత నాబార్డ్ ద్వారా రుణాలు చెల్లించి సహకరిస్తామని తెలిపారు. ఇక్కడ కూడా అలాంటివి చేస్తారా అని ప్రశ్నించగా, ఇక్కడ తాము పెట్టుబడులు పెట్టలేమని, మీరే డబ్బులు ఇప్పిస్తే చేస్తామని వివరించారు. అలాగే గ్రామంలో మహిళలకు, నిరుద్యోగులకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇంటి వద్దనే పనులు చేసుకుని స్వయం సమృద్ధిని సాదిస్తామని కోరారు. దీనితో సంతృప్తిని వ్యక్తం చేసిన హెచ్‌ఆర్ దవే ప్రభుత్వానికి మీ అభిప్రాయాలను వివరిస్తామన్నారు. దీనినే దేశమంతటికీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈకార్యాక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నాబార్డ్ జిఎంలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సిసిబ్యాంక్ ఎజీఎం దయామృతం, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీఆర్‌వో వెంకట్‌రావు, డీపీవో బిక్షపతి, ఎంపిపి బుజ్జీనాయక్, తహశీల్దార్ శ్రీనివాస్‌కుమార్, సర్వేల్ సర్పంచ్ సతీశ్‌కుమార్, ఎంపీటీసీ కత్తుల లక్ష్మయ్య, ధాన్ ఫౌండేషన్ అధికారులు ఎడ్ల మల్లేశ్, ఈశ్వర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పందుల శంకరయ్య, వివిధ పార్టీల నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.