నల్గొండ

గ్రామస్థాయి నుంచి బిజె పి బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఏప్రిల్ 24: భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు అంకితభావం, పట్టుదలతో కృషి చేయాలని బిజెపి నూతన అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లో ఆదివారం డాక్టర్ లక్ష్మణ్‌కు జిల్లా, మండల నాయకులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. మిఠాయిలు తినిపించారు. అనంతరం జరిగిన అభినందన సభలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణం కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. 2019 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలోని ఏన్డీయే సర్కార్ మోదీ సారథ్యంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి చేరవేయాలన్నారు. ప్రతి ఇంటిపై బిజెపి జెండాను ఎగరవేసే బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి సాధిస్తుందన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. వ్యవసాయం లాభాసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. పంటల బీమా పథకాన్ని మరింత సులభతరం చేసిందన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేయడంలేదన్నారు. 14వ ఆర్ధిక సంఘం నిధులు గ్రామానికి రూ.20లక్షలు కేటాయిస్తే గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి బకాయిలకు మళ్లించిందని విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ఉపయోగపడుతున్నాయని ధ్వజమెత్తారు. 2019 నాటికి ఇంటింటికి నీళ్లు అందించకుంటే ఓట్లు అడగమని చెబుతున్నారు తప్పా ఇప్పటి మాటేమిటని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. కరువుతో ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. తాగు,సాగునీటి సమస్యతో సతమతమవుతున్నా ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. జనాలు పిట్టల్లా రాలిపోతున్నా స్పందించడంలేదని విమర్శించారు. ఇంటింటికి నల్లాల ద్వారా రక్షిత జలాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్‌గ్రిడ్ పథకానికి చిహ్నంగా నిర్మించిన పైలాన్ నిర్మాణంలో అవకతకవలు, అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు. పైలాన్‌లోనే అవినీతి ఉంటే మిషన్ భగీరథ పరిస్థితి ఏమిటని నిలదీశారు. కేసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని ధ్వజమెత్తారు. 2017 నాటికి రాష్ట్రం సుమారు 2 లక్షల కోట్ల అప్పుకు చేరుకుంటుందని పేర్కొన్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చుతున్నాడని విమర్శించారు. నక్కలగండిని ఏడాదిలో పూర్తి చేయిస్తానని, అవసరమైతే అక్కడే కుర్చీ వేసుకోని కూర్చోని పనులు చేయిస్తానని చెప్పిన కేసిఆర్ మాట తప్పాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని గుర్తుచేశారు. మరో దశాబ్ద కాలంలో దేశానికి మోదీ పాలన అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డి, కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, గీత, కిస్నామోర్చ రాష్ట అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు వీరెళ్లి చంద్రశేఖర్, గార్లపాటి జితేందర్‌రెడ్డి, కర్నాటి ధనుంజయ్య, దోనూరి వీరారెడ్డి, దూడల బిక్షంగౌడ్, దాసోజు బిక్షమాచారి, పాలకుర్ల జంగయ్య, బత్తుల జంగయ్య, మనె్న ప్రతాపరెడ్డి, రమనగోని శంకర్, వనం ధనుంజయ్య, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, పిల్లలమర్రి మధుసూదన్, కాసుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.