నల్గొండ

భగ్గుమన్న నల్లగొండ కౌన్సిల్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 21: నల్లగొండ మున్సిపాల్టీని కార్పొరేషన్ చేసే క్రమంలో కొత్తగా మూడు కిలోమీటర్ల పరిధిలోని 14గ్రామ పంచాయితీలను మున్సిపాల్టీలో విలీనం చేసే ప్రతిపాదనలను అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష బిజెపి, సిపిఎం, కాంగ్రెస్ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు నిరసనలకు దిగడంతో మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం దద్ధరిల్లింది. చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం ప్రారంభంకాగానే విలీన గ్రామాల సమస్యపై రచ్చ మొదలైంది. బిజెపి సభ్యులు పంచాయితీల విలీనాన్ని వ్యతిరేకిస్తు చైర్ పర్సన్ పొడియం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. వారి నిరసనకు టిఆర్‌ఎస్, కాంగ్రెస్, సిపిఎం పార్టీల కౌన్సిలర్లు మద్ధతు తెలిపి గ్రామాల విలీనం వద్ధంటు తమ స్థానాల్లోనే ఉండి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంఐఎం కౌన్సిలర్ అహ్మద్ ఖలీమ్ పంచాయతీల విలీనాన్ని సమర్ధిస్తు మున్సిపాల్టీకి కార్పోరేషన్ హోదా దక్కుతుందని చెబుతు బిజెపి సభ్యులు కేవలం ప్రచారం కోసమే గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారంటు విమర్శించారు. ఎంఐఎం సభ్యుడి వాఖ్యలపై తీవ్ర నిరసన తెలిపిన బిజెపి కౌన్సిలర్లు ఆయనతో వాగ్వివాదానికి దిగడంతో సమావేశం రచ్చరచ్చగా మారింది. దీంతో చైర్ పర్సన్ లక్ష్మి జోక్యం చేసుకుని సభ్యుల అభిప్రాయలను ప్రభుత్వానికి నివేధిస్తామంటు చెప్పి కౌన్సిల్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేయడంతో ఇతర ఏజెండా సమస్యలు చర్చకు రాకుండాపోయాయి.
కాగా మున్సిపాల్టీలో గ్రామాల విలీనాన్ని బిజెపి ఫ్లోర్ లీడల్ నూకల వెంటనారాయణరెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డిలు, సిపిఎం ఫ్లోర్ లీడర్ ఎండి.సలీమ్, టిఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కాంగ్రెస్ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్‌రెడ్డిలు తీవ్రంగా వ్యతిరేకిస్తు మాట్లాడారు. 2013లో ఏడు గ్రామ పంచాయితీలను విలీనం చేసి అక్కడి ప్రజలపై పన్నుల భారం మోపడం, ఉపాధి హామీ పథకం, గ్రామీణాభివృద్ధి పథకాలను వారికి దూరం చేయడం తప్ప ఆ గ్రామాల్లో చేసిన వౌలిక వసతుల అభివృద్ధి ఏమి లేదంటు ఆరోపించారు. కొత్తగా మళ్లీ కార్పొరేషన్ హోదా కోసం మరో 14 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తామనడం ఆ పంచాయతీ ప్రజలను మరింత ఇబ్బందుల పాలు చేయడమేనని ఆరోపించారు. పక్కా పల్లెవాతావరణంతో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవించే సదరు గ్రామాల విలీనంతో అక్కడి ప్రజలు నష్టపోవడం జరుగుతుందని వారు విలీనాన్ని వ్యతిరేకించారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, బొజ్జ నాగరాజు, అవుట రవి, ఖయ్యుంబేగ్, దుబ్బ అశోక్ సుందర్, ఎడ్ల గీత తదితరులు పాల్గొన్నారు.