నల్గొండ

తీరు మారని శిశుగృహ నిర్వాహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, నవంబర్ 21: అనాథ ఆడబిడ్డల సంరక్షణ కేంద్రంగా ఉన్న నల్లగొండ శిశుగృహ నిర్వాహణలో నిర్లక్ష్యం జాఢ్యం మాత్రం వదలడం లేదు. ఇటీవల నెల రోజుల వ్యవధిలో శిశుగృహ చిన్నారులు పది మంది తీవ్ర అస్వస్థత, సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో మృతి చెందడం, మరో 11మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలైన ఘటన ఈ నెల 8న వెలుగుచూడటం రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన పిదప మేల్కొన్న కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు శిశుగృహను సందర్శించి వెంటనే చిన్నారుల సంరక్షణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శిశుగృహలో వసతుల మెరుగుకు, చిన్నారుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీలు సైతం వేశారు. తరుచు తనిఖీలు సైతం నిర్వహిస్తున్నప్పటికి శిశుగృహ పరిస్థితి మారలేదనడానికి మంగళవారం శిశుగృహలో కనిపించిన చిన్నారుల దుస్థితియే నిదర్శనంగా నిలుస్తుంది. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు చిన్నారుల సంరక్షణ పట్ల హడావుడి చేసే శిశుగృహ సిబ్బంది అనంతరం చిన్నారుల సంరక్షణపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనమన్నట్లుగా మంగళవారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి తనిఖీ పిదప సాయంత్రం శిశుగృహను సందర్శించిన వారికి చిన్నారులు నేలపై వేసిన పరుపులపైన కొందరు, నేలపైన పరిచిన చలువరాతి బండలపై మరికొందరు దొర్లుతు, పడుకుని కనిపించారు. ఇప్పటికే చనిపోయిన, అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలైన చిన్నారుల్లో పోషకాహారం, తల్లిపాల కరవు, రక్తహీనత వంటి సమస్యలతో పాటు చలి, దోమలతో కూడిన వ్యాధుల బారిన పడిన వారు సైతం ఉన్నారు. ఐనప్పటికి చలికాలంలో చలువరాతి బండలపై చిన్నారులను పడుకోబెట్టడటంతో వారు జలుబు వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. శిశుగృహ సిబ్బంది ఈ తరహా సమస్యలపై దృష్టి పెట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోకపోవడం, వారికి సకాలంలో వైద్యం అందించకపోవడంతోనే చిన్నారులు తీవ్ర అస్వస్థల పాలవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. చలి, దోమల బారి నుండి చిన్నారులను సంరక్షించేందుకు వారికి స్వెట్టర్లు, సాక్స్‌లు, పూర్తి దుస్తులు, దోమతెరలు వేయాల్సిన అవసరమున్నా ఈ దిశగా చర్యలు లేకపోవడం చిన్నారుల సంరక్షణను ప్రశ్నార్థకం చేస్తోంది.