నల్గొండ

భార్య కాపురానికి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 23: తన భార్య కాపురానికి రావడం లేదంటూ ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం నల్లగొండ మండలం మర్రిగూడ శివారులో చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం సింగిరికొండ మల్లికార్జున్(35) నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇతనికి రెండున్నరేళ్ల క్రితం చిట్యాలకు చెందిన జ్యోతితో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. అయితే తన భార్య జ్యోతికి అనారోగ్యం ఉండటంతో 15 లక్షల వరకు ఖర్చు చేశాడు. అదే విధంగా జ్యోతి తండ్రికి 8 లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చినట్లు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. పలుమార్లు తాను ఇచ్చిన 8 లక్షల అప్పును అడగగా మల్లికార్జున్ బావమరుదులు కొట్టడమే కాక తనపై అదనపు కట్నం అడుగుతున్నట్లు ఆరోపణలు చేస్తూ కేసులు సైతం పెట్టారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అదే విధంగా తన భార్య కాపురానికి రావడం లేదని కొంత కాలంగా మనస్థాపం చెందుతున్నాడు. ఇదిలా ఉండగా గురువారం మల్లికార్జున్ తన స్నేహితుడికి ఆత్మహత్య విషయమై వాట్సప్ వీడియో పంపడంతో అతను వెంటనే ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఉరి వేసుకొని విగత జీవుడై ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడు మల్లికార్జున్ హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి అన్న సింగిరికొండ వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
పెద్దఅడిశర్లపల్లి, నవంబర్ 23: ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండల పరిధిలో చోటుచేసుకుంది. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గుడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల సింగరాజుపల్లికి చెందిన శిరసు ఇద్దయ్య(56) వ్యవసాయంలో భారీగా నష్టం రావడంతో తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన బంధువులు హుటాహుటిన దేవరకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గుడిపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
స్నానానికి వెళ్లి నీటిలో మునిగి వ్యక్తి మృతి
పెద్దఅడిశర్లపల్లి, నవంబర్ 23: మండలంలోని కోదండాపురం ప్లాంట్‌లో నూతనంగా నిర్మించిన నీటి శుద్ధి బావిలో ప్రమాదవశాత్తు వ్యక్తి పడి మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నడియా జిల్లాలో గల ఉత్తర్ గోయల్‌కు చెందిన పీపల్ మండల్(25) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందాడు. కోదండాపురం ప్లాంట్‌లో మిషన్ భగీరథలో భాగంగా ఎస్‌ఎస్ కంపెనీ చేపడుతున్న పనుల్లో మేస్ర్తిగా పని చేస్తున్నాడు. గత మూడు నెలలుగా పనులు చేస్తుండగా, 20 రోజుల క్రితమే ఇంటికి వెళ్లి తిరిగి వచ్చాడు. సైట్ ఇంజినీర్ ఆకుల వీరకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు గుడిపల్లి ఎస్‌ఐ తెలిపారు.