నల్గొండ

డిసెంబర్ 10 నాటికి భగీరథ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను డిసెంబర్ 10లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ ఆదేశించారు. గురువారం సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. నీటి శుద్ధిప్లాంట్, ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌లతో చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా భావిస్తున్న ఈ పథకం నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పనులను నిర్ధేశిత గడువులోగానే పూర్తిచేయించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రస్తుతం జరుగుతున్న పనులను మరింత వేగం చేసేందుకు అవసరమైతే అదనంగా కూలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పనుల కోసం సరిపడా ఇసుకను కేటాయిస్తునట్లు తెలిపారు. డిసెంబర్ 10లోగా అన్ని పనులు పూర్తిచేసి ట్రయల్న్‌క్రు సిద్ధం చేయాలని ఆదేశించారు. 2018 జనవరి నుండి జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి నల్లాల ద్వారా సురక్షిత నీటిని అందించనున్నట్లు తెలిపారు. ఇమాంపేట కొండపై జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు. అనంతరం హుజూర్‌నగర్ రోడ్డులో జరుగుతున్న పనులను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మిషన్ భగీరథ అధికారులు ఉన్నారు.
ఉత్తమ్‌ను ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించాలి
- టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లయ్య యాదవ్
కోదాడ, నవంబర్ 23: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఎన్నికలకు అనర్హునిగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. గురువారం కోదాడలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంకోసం పోరాడానంటూ చెప్పుకొని అధికారం కోసం పాకులాడుతూ కోదాడ శాసనసభ్యునిగా ఉన్నకాలంలో సింగారం, మాదారం ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కోట్లరూపాయలు కొల్లగొట్టారన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంనుండి పోటీచేసిన ఉత్తమ్ గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికలలో ప్రత్యర్ధి పార్టీల అభ్యర్థులను బలహీనులను తెచ్చుకొని రాజకీయ ములాఖత్‌లు నడుపుతున్నారని ఆరోపించారు. సూర్యాపేట ముఖ్యమంత్రి సభలో పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి రైతాంగం సమస్యలు, నిరుద్యోగ సమస్య, ఫ్లోరైడ్ సమస్య, నీటి సమస్యలపై కనీసం స్పందించలేదని అన్నారు. ఉత్తమ్ అవినీతి రాజకీయాలను బహిర్గతం చేస్తామని అన్నారు. ఎన్నికలు, అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఉత్తమ్‌ను ఎన్నికలకు అనర్హునిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఓరుగంటి ప్రభాకర్, నంబూరి సూర్యం, మురళి తదితరులు పాల్గొన్నారు.