నల్గొండ

ఇసుక అక్రమ రవాణాను నివారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 23: ప్రజల రక్షణే నల్లగొండ జిల్లా పోలీస్ అభిమతమని, ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా పనిచేసి స్నేహపూర్వకమైన పోలీస్, ప్రజా సంబంధాలను కొనసాగించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, న్యాయ సేవా సదన్ జడ్జీ ప్రభాకర్‌రావుతో కలిసి ఆయన సమీక్షించారు. పోలీస్, రెవెన్యూ శాఖల సహకారంతో అక్రమ ఇసుక రవాణాను నివారించే చర్యలపై, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు ముమ్మరం తదితర అంశాలపై చర్చించారు. కేసులు పెండింగ్‌లో ఉండకుండా, ప్రజలకు అసౌకర్యాలు కలుగకుండా చూడాలని, నేరాల అదుపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. జనమైత్రి పోలీస్‌లో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలను సురక్షిత కాలనీలుగా చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలను అరికట్టాలని, ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రతీ శుక్రవారం స్వచ్ఛ్భారత్ నిర్వహించాలని, మొక్కలు నాటాలని, గ్రామ సభలు, పల్లె నిద్రలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బీట్ల ఏర్పాటు, వాహనాల తనిఖీ, దొంగతనాల నివారణ, మట్కా, గంజాయి తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.