నల్గొండ

నేడు గుట్టకు ముఖ్యమంత్రి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, నవంబర్ 23: యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ స్వామి దేవస్థానం అభివృద్ధి పనుల పరిశీలన, విద్యార్థి సంఘం నాయకుడు తుంగ బాలు పెళ్లికి హాజరుకావడం నూతన వధూవరులను ఆశీర్వదించడం కోసం శుక్రవారం సిఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు రానున్నారు. హెలికాప్టర్‌లో హైదాబాద్ నుండి ఉదయం 11.00 గంటలకు బయలుదేరి యాదగిరిగుట్ట సమీపంలోని సురేంద్రపురి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకుంటారు. యాదగిరిగుట్ట సమీపంలోని మైలార్‌గూడెం శివసాయి ఫంక్షన్‌హాల్లో 11.05 నిమిషాలకు జరుగనున్న టిఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుండి 11.30 గంటలకు యాదాద్రి కొండపైకి చేరుకుంటారు. స్వామి వారిని దర్శించుకొని 11.40 నుండి 12.30 వరకు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం పెద్ద గుట్టపై టెంపుల్ సిటీ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటకు కొండపైన హరితభవన్‌లో భోజనం చేసి కాసేపటి విరామం అనంతరం వైటిడిఏ, ఆర్ అండ్ బి తదితర శాఖల ఉన్నతాధికారులతో ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి తగు సూచనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి హైద్రాబాద్ బయలుదేరుతారు. యాదాద్రిలో ఇప్పటికే పోలీసులు భారీ భధ్రతా చర్యలు చేపట్టారు. పట్టణంలో, కొండపైన, ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. గత రెండు రోజులుగా కొండపైన ఘాట్ రోడ్డుపై, హెలీప్యాడ్ వద్ద బాంబ్, డాగ్ స్వాడ్ తనిఖీలను చేపట్టారు. రాచకొండ జాయింట్ సీపీ తరుణ్‌జోషి, డీసీపీ రామచంద్రారెడ్డి యాదగిరిగుట్టకు చేరుకొని భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

నకిలీ, అక్రమ భూ పట్టాల రద్దు
- కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
గుర్రంపోడు, నవంబర్ 23: మండలంలోని పాల్వాయి, బొల్లారం, ఉట్లపల్లి, పోచంపల్లి గ్రామాల్లో నకిలీ పాసు పుస్తకాలు, ప్రభుత్వ భూములపై అక్రమ పట్టాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. గురువారం మండలంలోని జూనూతల గ్రామంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఆయన పాల్గొని రికార్డులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తమ దృష్టికి వచ్చిన అక్రమ పట్టాలపై రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ బొల్లారం, పాల్వాయి గ్రామాల్లో అధికంగా ప్రభుత్వ భూముల పట్టాలు, ఎకరం భూమి ఉన్న వ్యక్తి ఐదెకరాల భూమి ఉన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న పట్టాలను గుర్తించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 15 వరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సర్వేలు పూర్తి చేసి అక్రమ పాసు పుస్తకాలన్నింటినీ రద్దు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీవో లింగ్యానాయక్, తహశీల్దార్ సురిగి సైదులు, సీనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి, ఆర్‌ఐ మహేష్, వీఆర్‌వోలు వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.