నల్గొండ

ప్రియుడి ఇంటి ముందు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్(యం), డిసెంబర్ 11: తనను ఐదు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టిన సంఘటన సోమవారం మండలంలోని రాఘవాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సుదగాని శివరామ్ మోత్కూర్ మండలం జామచెట్లబావి గ్రామానికి చెందిన బీసు రేఖలు ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రేఖ ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆమె మేన బావతో బలవంతంగా పెళ్లి చేశారు. అప్పటికీ ప్రేమించిన యువకుడు శివరామ్ నువ్వు లేకుంటే తాను చనిపోతానని రేఖను బెదిరించడంతో పెళ్లి అయిన మరుసటి రోజే భర్తను వదిలేసి ప్రియుడి ఇంటికి వెళ్లగా.. 20 లక్షలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని డిమాండ్ చేయడంతో రేఖ తల్లిదండ్రులు పది లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. చివరికి శివరామ్‌కు 12 లక్షలు ఇచ్చేందుకు రేఖ తల్లిదండ్రులు ఒప్పందం చేసుకున్నా.. శివరామ్, అతని తల్లిదండ్రులు రేఖను పెళ్లి చేసుకోమని నిరాకరించారు. దీంతో భర్తను కాదని ప్రియుడినే నమ్ముకొని మోసపోయిన రేఖ ప్రియుడు శివరామ్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. తనను ఐదు సంవత్సరాలుగా నమ్మించి మానసికంగా, శారీరకంగా లొంగదీసుకొని ఇప్పుడు తనను వద్దంటున్నాడని రేఖ ఆవేదన వ్యక్తం చేసింది. తాను పెళ్లి చేసుకుంటే.. చనిపోతానని బెదిరించిన శివరామ్ ఇప్పుడు తనను కాదనడం ఎంత వరకు న్యాయమని విలపించింది. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. రేఖను నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకొని, రేఖకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

భూదాన్‌ను సందర్శించిన విదేశీ అధికారుల బృందం
భూదాన్‌పోచంపల్లి, డిసెంబర్ 11: నిమిక్నీ ఆధ్వర్యంలో 12 దేశాలకు చెందిన 24 మంది అధికారుల బృందం సోమవారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించింది. ఈ సందర్భంగా అధికారులు స్థానిక గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. మహిళా సంఘాల రుణాలు, పొదుపు, ప్రభుత్వం చేయూత, బ్యాంక్ నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత కార్మికుల గృహాలకు వెళ్లి వస్త్రాల తయారీ విధానం, కార్మికుల జీవన ప్రమాణాలను పరిశీలించారు. చేనేత సహకార సంఘం టూరిజం సెంటర్‌ను వారు సందర్శించారు. ప్రోగ్రాం డైరెక్టర్ టి.వెంకటేశంరెడ్డి, విజయలు బృందానికి మార్గదర్శనం చేశారు. హైద్రాబాద్‌లో జరిగే సమావేశంలో కార్యక్రమానికి హాజరైన ఈ బృందం క్షేత్ర పర్యటనలో భాగంగా భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు.
పోచంపల్లిలో డాక్యుమెంటరీ చిత్రీకరణ
భూదాన్‌పోచంపల్లి, డిసెంబర్ 11: ప్రపంచ తెలుగు మహా సభలను పురస్కరించుకొని తెలుగు పండుగలు, సాంప్రదాయాలపై మండల కేంద్రంలో సోమవారం డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఇంటి ముందు ముగ్గులు, దీపాలు వెలిగించడం, ఇంటిని పూలతో అలంకరించడం, పండుగ నిర్వహణపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సత్యనారాయణ, కెమెరామెన్ ఉదయ్, కో డైరెక్టర్ హైందవి, ఆర్టిస్టు బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.